Share News

ఫ్లైఓవర్‌ పనులు పూర్తిచేయాలి

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:17 AM

చౌటుప్పల్‌ పట్టణంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై జరుగుతున్న ఫ్లై ఓవర్‌ పనులను త్వరిత గతిన పూర్తి చేయించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సూచించారు.

ఫ్లైఓవర్‌ పనులు పూర్తిచేయాలి
ఫ్లైఓవర్‌ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

చౌటుప్పల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్‌ పట్టణంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై జరుగుతున్న ఫ్లై ఓవర్‌ పనులను త్వరిత గతిన పూర్తి చేయించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సూచించారు. ఫ్లై ఓవర్‌ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల్లో జాప్యంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని, చిరు వ్యాపారుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పాదాచారులు హైవే రోడ్డు దాటేందుకు క్రాసింగ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు పల్లె శేఖర్‌రెడ్డి, నాయకులు పగిల్ల మోహన్‌రెడ్డి, ఉడుత రామలింగం, కొండూరు వెంకటేశం, రాములు, సుధాకర్‌, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 12:17 AM