kumaram bheem asifabad- బిర్సా ముండా పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం
ABN , Publish Date - Nov 15 , 2026 | 10:40 PM
బిర్సా ముండా పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని, ఆ మహనీయుడి ఆశయాలను కొనసాగించాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం స్వాతంత్య్ర సమర యోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతిని పురష్కరించుకొని జనజాతీయ గౌరవ దివస్ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ విదానం ద్వారా సందేశం అందించారు
ఆసిఫాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): బిర్సా ముండా పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని, ఆ మహనీయుడి ఆశయాలను కొనసాగించాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం స్వాతంత్య్ర సమర యోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతిని పురష్కరించుకొని జనజాతీయ గౌరవ దివస్ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ విదానం ద్వారా సందేశం అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ దివస్‌గా నిర్వహించడం ద్వారా ఆదివాసీల ఆత్మగౌరవానికి సముచిత గుర్తింపు కల్పించామని తెలిపారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో, గిరిజనుల హక్కుల పరిరక్షణలో బిర్సా ముండా చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. గిరిజనుల అభ్యున్నతికి, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వివరించారు. అనంతరం ఆదివాసి సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్, జిల్లా గ్రంఽథాల యసంస్థ చైర్మన్ అనిల్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మంగ, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి జాదవ్ అంబాజీ, ఆదివాసీ సంఘాల నాయకులు సిడాం అర్జు, కోవ విజయ్, బీజేపీ నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు, మల్లికార్జున్, ఏసీఎంవో పుర్క ఉద్దవ్, జీసీడీవో శకుంతల, డీఎల్‌పీవో ఉమర్ తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి,(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధవిహార్‌లో ఆదివారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బిర్సా ముండా జయంతిని పురస్కరిచుకుని ఆయన చిత్రపటానికి ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ మహోల్‌కార్ మాట్లాడుతూ గిరిజన హక్కుల పరిరక్షణకోసం, ఆదివాసీల అభ్యున్నతికోసం భగవాన్ బిర్సా ముండా చేసిన పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. బ్రిటిష్ పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి, ఆటవీ హక్కులు, ఆదివాసీల ఆత్మగౌరవం కోసం భగవాన్ బీర్సా ముండా చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భంతే భరద్వాజ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు దుర్గం దుర్గాజీ, నాయకులు దుర్గం శ్యాంరావు, రాజేశ్వర్, విజయ్, విలాస్, రమేష్, రాకేష్, దుర్గం మనోజ్, సంతోష్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): మండలంలోని మార్లవాయి, ఢబోలి, రాసిమెట్ట, జంగాం, జైనూర్ తదితర గ్రామాల్లో ఆదివాసీలు ఆదివారం బిర్సా ముండా చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళలు ఆర్పించారు. అనతరం మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేష్ మాట్లాడుతు బిర్సాముండా కేవలం స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాదని ఆదివాసీ ఆత్మ గౌరవానికి, స్వాభిమానానికి, హక్కుల సాధనకోసం పోరాడిన వ్యకి అని కొనియాడారు. ఆనాటి కాలంలో బ్రిటిష్ పాలకుల దోపిడీ, అన్యాయాలు, ఆదివాసీల భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం దేశ చరత్రలో చిరస్థాయిగా నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆత్రం రాజేశ్వర్, గ్రామస్తులు ఆత్రం మానిక్‌రావ్, దేవారి గణపత్‌రావ్, ఉపాధ్యాయులు కనక వెంకటేశ్వర్‌రావ్, కనక సోనేరావ్, రాయి సెంటర్ గీతధర్, ఆత్రం భగ్వం త్, కనక కొద్దు, హన్మంత్‌రావ్, ఆనంద్, సింగు, సీతారాం, గణపతి, ఏసు, నగేష్, దేవశా, రాము లు, జంగు, లచ్చు, సోము, సుంగు తదితరులు పాల్గోన్నారు.