kumaram bheem asifabad- జోరందుకున్న పుర పోరు
ABN , Publish Date - Feb 05 , 2026 | 10:20 PM
మున్సిప ల్ ఎన్నికల పోలింగ్ 11న ఉంది. 9వ తేదీన ప్రచారా నికి తెరపడనుంది. మధ్యలో నాలుగు రోజులే మిగి లింది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశా రు. ఎన్నికల్లో గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
- ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు
- క్షేత్రస్థాయిలో పార్టీల అగ్రనాయకులు
- అత్యధిక స్థానాల్లో విజయమే లక్ష్యంగా పావులు
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మున్సిప ల్ ఎన్నికల పోలింగ్ 11న ఉంది. 9వ తేదీన ప్రచారా నికి తెరపడనుంది. మధ్యలో నాలుగు రోజులే మిగి లింది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశా రు. ఎన్నికల్లో గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ఒక్క ఆవకాశాన్ని కూడా వదులు కోకుండా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ఇప్ప టికే ప్రధాన పార్టీలు ఇంటింటా ప్రచారాన్ని ముమ్మ రం చేశాయి. తమ పార్టీల అభ్యర్థులను గెలిపించు కునేందుకు అగ్రనేతలు ప్రచారంలో పాల్గొంటున్నా రు.
- సమయం తక్కువగానే..
పోలింగ్‌కు మరో ఆరు రోజులు మాత్రమే ఉండ డంతో మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్‌కు ఎక్కువ సమయం లేక పోవడంతో పోటాపోటిగా వార్డుల్లో ప్రచారబాట పడుతున్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో 94 మంది, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో 130 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఉదయం నుంచి రాత్రి వరకు మద్దతుదారులు, అనుచరులతో కలిసి వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తు న్నారు. ప్రచారానికి వస్తున్న కార్యకర్తలు, మద్దతుదా రులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. టీ, టీఫిన్‌తో పాటు మధ్యాహ్న బోజనం, రాత్రి మందు, విందులతో జోష్ నింపుతున్నారు. కొంతమంది కార్యకర్తలకైతే నగదును కూడా అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రదాన పార్టీల అభ్యర్థులు ఆయా పార్టీ ల కండువాలు వేసుకొని జెండాలు పట్టుకొని ప్రచా రం చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు మాత్రం వారి కి ఎన్నికల అధికారులు కేటాయించిన గుర్తులతో ఓటర్ల వద్దకు వెళుతున్నారు.
- పార్టీల వారీగా ప్రచార రథాలు..
ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఆయా వార్డుల్లో పర్యటించి ఓటర్లను కలిసేందుకు అనువుగా ప్రచార రథాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆసిఫా బాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షు రాలు సుగుణ, నియోజకవర్గ ఇన్‌చార్జీ శ్యాంనాయక్, మాజీ డీసీసీ విశ్వప్రసాద్‌రావు, ఏఎంసీ ఛైర్మన్ మంగ, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు చరణ్‌లు తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచా రాన్ని ముమ్మరం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ సింగిల్ విండో ఛైర్మన్ ఆలీబీన్ ఆహ్మద్, పార్టీ అధ్యక్షులు జాబిరే రవి వార్డుల్లో ప్రచారం చేపడుతు న్నారు. బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు గురువారం ఆదిలాబాద్ ఎంపీ గొడెం నగేష్ ఆసిఫాబాద్‌లో పర్యటించి జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లిఖార్జున్, సీనియర్ నాయకు లు సతీష్‌బాబు, సుహసిని, విశాల్, సెర్ల మురళీలతో కలిసి వార్డుల్లో ప్రచారం చేపట్టారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్సీ దండె విఠల్ ప్రచారాన్ని చేపడుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్వి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు మార్, మాజీ ఎమ్మెల్యే కోనప్ప, మాజీ జడ్పీ ఛైర్మన్ కృష్ణారా వులు ప్రచారాన్ని విస్తృతం చేశారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, సీనియర్ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేపడుతున్నారు.
- వ్యూహ ప్రతివ్యూహాలు..
మున్సిపాలిటీల పరిధిలోని కాలనీల వారీగా సర్వే లు చేయించి నివేదికలు తెప్పించుకొని ఆదినాయకు లు అభ్యర్థులు బలహీనంగా ఉన్న వార్డుల్లో అనుస రించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తూ ఓటర్లను ఆకర్షిం చేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతు న్నారు. ఎన్నికల్లో గెలుపే ప్రధాన లక్ష్యంగా అయా పా ర్టీల నాయకులు వ్యూహలకు పదును పెంచారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. తమకు నమ్మకమైన వ్యక్తుల ద్వారా అభ్యర్థులు పనులను చక్కబెట్టుకుంటున్నారు. ప్రచారానికి నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలను చేస్తున్నారు. దీం తో రోజురోజుకు మున్సిపల్ రాజకీయం రసవత్త రంగా మారుతోంది.