Share News

ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

ABN , Publish Date - Sep 04 , 2026 | 11:06 PM

ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను మతాలకు అతీతంగా శాంతి యు తంగా జరుపుకోవాలని జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు కోరారు.

ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు

చెన్నూరు, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి) :ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను మతాలకు అతీతంగా శాంతి యు తంగా జరుపుకోవాలని జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం స్థానిక మార్వాడీ భవన్‌లో పోలీసుల ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఉత్సవ కమి టీ నిర్వహకులు నిబంధనలు పాటిస్తూ మండపాలను ఏర్పాటు చే సుకో వాలని, మండపాల ఏర్పాటుకు ముందు పోలీసుల అనుమతి తీసుకో వాలన్నారు. డీజేల వినియోగంపై ఉన్న నిబందనలను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలని, ఉత్సవాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అందరు పోలీసులకు సహకరించాలన్నారు. వినాయక నిమ జ్జనం రోజు నిర్వహించే శాంతి యాత్రలో శాంతి భద్రతలను కాపాడే క్ర మంలో యువకులు మండపాల నిర్వహకులు పోలీసులకు పూర్తిగా సహ కరిస్తూ నిబంధనల ప్రకారం క్రమ సంఖ్యను ర్యాలీ నిర్వహించుకోవా లన్నారు. ఈ సమావేవంలో మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌, సీఐ బన్సీలాల్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెద్దింటి పద్మ, వైస్‌ చైర్మన్‌ వినయ్‌ కు మార్‌, కౌన్సిలర్‌ అజీమ్‌, సంతోష్‌, కో ఆప్షన్‌ సభ్యులు సాధనబోయిన జనార్ధన్‌రావు, లక్ష్మీరాజగౌడ్‌, కుల సంఘాల నాయకులు, గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2026 | 11:06 PM