Share News

kumaram bheem asifabad-పొలాల అమావాస్య సందడి

ABN , Publish Date - Sep 09 , 2026 | 10:55 PM

జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించే పొలాల అమావాస్యకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాలో ఎక్కువగా రైతులు ఆదివాసి సంస్కృతికి ముడిపడి ఉండడంతో పాటు పశువుల సంతతి ఎక్కువగా ఉంది. దీంతో పొలం పనుల్లో ఉపయోగించే ఎద్దుల పని పూర్తయిన తర్వాత వచ్చే పండుగ కావడంతో పొలాల పండుగకు జిల్లాలో మరింత ప్రాశస్థి ఉంది. పండుగపూట ఎడ్లను అలంకరించడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

kumaram bheem asifabad-పొలాల అమావాస్య సందడి
:దుకాణాల ముందు విక్రయించేందుకు ఉన్న అలంకరణ వస్తువులు

ఆసిఫాబాద్‌రూరల్‌/వాంకిడి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించే పొలాల అమావాస్యకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాలో ఎక్కువగా రైతులు ఆదివాసి సంస్కృతికి ముడిపడి ఉండడంతో పాటు పశువుల సంతతి ఎక్కువగా ఉంది. దీంతో పొలం పనుల్లో ఉపయోగించే ఎద్దుల పని పూర్తయిన తర్వాత వచ్చే పండుగ కావడంతో పొలాల పండుగకు జిల్లాలో మరింత ప్రాశస్థి ఉంది. పండుగపూట ఎడ్లను అలంకరించడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జిల్లాలో అలంకరణ వస్తువులతో దుకాణాలు అకట్టుకుంటున్నాయి. జిల్లా కేంద్రంలో పొలాల అమవాస్య పండుగ సందడి ప్రారంభమైంది. పొలాల అమవాస్య వేడుకలు జిల్లా వ్యాప్తంగా కోలహలంగా జరుగనుండటంతో అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతులతో జిల్లా కేంద్రంలో మార్కెట్‌ సందడిగా మారింది. ఎడ్లను అందంగా తయారు చేసేందుకు అవసరమయ్యే సామగ్రి కొనుగోలు చేసేందుకు దుకాణాలు రైతన్నలతో బిజీబిజీగా మారాయి. వీటికి తోడు ఎడ్లను సర్వాంగసుందరంగా ముస్తాబుచేసేందుకు అవసరమయ్యే ముక్కుతాడు, గజ్జెలు, ప్లాస్టిక్‌ పువ్వులు, మెడలకు వేసే జోళ్లు, వస్త్రాలతో తయారుచేసే కవచాలు కొనుగోలు చేస్తున్నారు. నేటి అధునిక యుగంలో పొలాల అమవాస్యకు సైతం రైతన్నలు ఆధునికతను జోడిస్తూ ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు పండుగ అవసరమయ్యే వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

గోవు ప్రతిమలకు ప్రత్యేకపూజలు:

అన్నదాతలకు తోడుగా ఉండే గోవులను కొలిచే పండుగైన పొలాల అమవాస్య రోజున ఇళ్లలో గోవు ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ.. మట్టితో గోవు ప్రతిమలు తయారు చేసి పూజలు జరుపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ఘనంగా నిర్వహించే పండుగ పొలాల అమవాస్య. పంటలను పండించడంలో గోవుల సేవలకు రైతన్నలు రుణం తీర్చుకునేల పండుగను జరుపుతారు. పండుగ రోజున ఉదయం గోవులకు స్నానంచేయించిన తర్వాత వివిధ రంగులు, పూలు, గజ్జెలు, పూలదండలు, వీపు బాగంలో అందమైన జోళ్లతో అలంకరిస్తారు. గోవులను సాయంత్రం వేళ అలయం వద్దకు తీసుకువెళ్లి ప్రదక్షిణలు చేయిస్తారు.

Updated Date - Sep 09 , 2026 | 10:55 PM