kumaram bheem asifabad- ఫార్మర్ రిజిస్ట్రీ అంతంతే..
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:22 PM
వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఓ పక్క సర్వర్ మొరాయింపు, ఇంకోపక్క వ్యవసాయ పనుల్లో రైతుల నిమగ్నం, మరోవైపు అవగాహన లేమి..వెరసి పంట లు ఆన్‌లైన్ నమోదుకు అడ్డంకిగా మారాయి.
- సాంకేతిక లోపాలతో ఆటంకం
- ఇప్పటి వరకు 60 శాతం మాత్రమే పూర్తి
వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఓ పక్క సర్వర్ మొరాయింపు, ఇంకోపక్క వ్యవసాయ పనుల్లో రైతుల నిమగ్నం, మరోవైపు అవగాహన లేమి..వెరసి పంట లు ఆన్‌లైన్ నమోదుకు అడ్డంకిగా మారాయి.
రెబ్బెన, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఫార్మ ర్ రిజిస్ట్రీ నామమాత్రంగానే కొనసాగుతోంది. ప్రతి రైతు వివరాలు డిజిటల్ రూపంలో ఆధార్, సెల్‌ఫోన్ నంబర్, పట్టాదారు పాస్ పుస్తకం, భూముల సర్వే నంబర్లు, సాగు తదితర వివరాలు అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో నమోదు చేస్తున్న రైతులకు 11 అంకెలతో కూడిన ఐడీని అందిస్తారు. మే 5న వ్యవసాయాధికా రులు ఈ ప్రక్రియ ప్రారంభించారు. మండలంలో 24పం చాయతీల పరిధిలో సుమారు 12 వేల మంది రైతులు ఉన్నారు. ఆయా గ్రామాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ మందకొడి గా సాగుతోంది. వ్యవసాయాధికారులు, ఇతర పనుల్లో ఉండడం, ఆపై ఏర్పడిన యూరియా కొరత, పంటల నమోదు ప్రక్రియలో బిజీగా మారడంతో మండలం లో రైతులు గుర్తింపు సంఖ్య 60 శాతం వరకు మాత్రమే పూర్తయింది. క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నప్పటికీ పలు కారణాలతో ఈ ప్రక్రియ శర వేగంగా సాగడం లేదు. ఆశించిన స్థాయిలో నమోదు ఆసక్తి చూపడం లేదు. సాంకేతిక లోపాలు ఇతరాత్ర కారణాలు వివరాల నమోదుకు ఆటంకాలుగా మారా యి. కొందరు ఇతర ప్రాంతాల్లో ఉండడం, మరో అడ్రస్‌లో ఆధార్ కార్డు ఉండడంతో ఇబ్బందికరంగా మారుతోంది. ప్రస్తుతం వానాకాలం సాగు చేసిన పంటల ఉత్పత్తులు రైతుల చేతికి అందుతున్నాయి. పత్తి, వరిధాన్యం కొనుగోలు కోసం చేపట్టాల్సిన పను ల్లో అధికారులు బిజీగా మారారు. అడపాదడపా ఈ ప్రక్రియ చేపడుతున్నా ఆశించిన ఫలితం కనిపిం చడం లేదు.
- పూర్తి సమాచారం ఉండేలా..
ప్రతి రైతు సమాచారం అందుబాటులో ఉంచు కునేలా వారికి యూనిక్ కోడ్ నంబరు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యవసాయ అధికారులు కేటాయించే 11 అంకెల ఐడీలో రైతులకు సంబంధిం చిన అన్ని వివరాలు సమాచారాన్ని పొందుపరుస్తా ు. రైతు కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్నే సంక్షేమ పథకాల విష యంలో యూనిక్ కోడ్‌ను పరిగణలోకి తీసుకోక పోయి నా భవిష్యత్‌లో పీఎం కిసాన్, ఇతర పథకాల డిజిటల్ అగ్రి కల్చర్ ప్లాట్ ఫ్లామ్స్‌కు అనుసంధానం చేయను న్నట్లు అధికారులు అంటున్నారు. తద్వారా భవిష్యత్‌లో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.
నిరంతర ప్రక్రియ..
- దిలీప్, మండల వ్యవసాయాధికారి
ఫార్మర్ రిజిస్ట్రీ నిరంతరం కొనసాగే ప్రక్రియ. పలు కారణాలతో కొంత మేరకు ఆలస్యంగా కొనసాగు తోంది. కేంద్ర ప్రభుత్వం వద్ద రైతులకు సంబంధిం చిన సమాచారం ఉండాలనే లక్ష్యంతో యూనిక్ కోడ్ నంబర్ కేటాయింపు ప్రక్రియను ప్రారంభించింది. భవిష్యత్‌లో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకా ల అనుసంధానం చేసే అవకాశం ఉండవచ్చు.