Share News

kumaram bheem asifabad- వనదేవతల జాతర ప్రారంభం

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:08 PM

జిల్లాలోని ఆసిఫాబాద్‌, రెబ్బెన, పెంచికలపేట, బెజ్జూరు మండలాల్లో బుధవారం సమక్క, సారలమ్మ జాతర ప్రారంభమైంది. ఆసిఫాబాద్‌ మండలం బూర్గుడ గ్రామంలో సమ్మక్క- సారలమ్మను ఎమ్మెల్యే కోవ లక్ష్మి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

kumaram bheem asifabad-  వనదేవతల జాతర ప్రారంభం
ఆసిఫాబాద్‌లో మొక్కులు చెల్లించుకుంటున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆసిఫాబాద్‌, రెబ్బెన, పెంచికలపేట, బెజ్జూరు మండలాల్లో బుధవారం సమక్క, సారలమ్మ జాతర ప్రారంభమైంది. ఆసిఫాబాద్‌ మండలం బూర్గుడ గ్రామంలో సమ్మక్క- సారలమ్మను ఎమ్మెల్యే కోవ లక్ష్మి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇంటి నుంచి డప్పు చప్పుళ్లతో మంగళవాయిద్యాల మధ్య కోలాహాలంగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే కుమార్తె అమ్మవార్లకు నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు సరస్వతీ, రవీందర్‌, ఉప సర్పంచ్‌ లక్ష్మి, నాయకులు బలరాం, నారాయణ, ప్రేం, సురేష్‌, సుప్రజ, సంగీత, ఉమ, లలిత తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలం గంగాపూర్‌ శివారుతో పాటు గోలేటి శివారులో బుధవారం సమ్మక్క- సారలమ్మ జాతర ప్రారంభమైంది. మేడారంలో జరుగుతున్న మహా జాతరను పురస్కరించుకొని కొంత కాలంగా మండలంలోని గంగాపూర్‌ గోలేటి పరిసర ప్రాంతాల్లో సమ్మక్క- సారలమ్మ జాతరను సంబంధిత నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో జరుపుతున్నారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్నా రు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

పెంచికలపేట, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): పెంచికలపేటలో సమ్మక్క- సారలమ్మ జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు సారలమ్మ గద్దెలపై కొలువు దీరింది. జాతర వ్యవస్థాపకుడు మృతి చెందిన గణపురం శ్రీనివాస్‌ సోదరుడు ప్రకాష్‌, పద్మ, రమేశ్‌ స్వరూప, భక్తులు అమ్మవార్లకు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం సమ్మక్క తల్లి గద్దెలపైకి రాకతో మహాజాతర జరుగనుందని కమిటీ సభ్యులు తెలిపారు. తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు రవీందర్‌, రాంచందర్‌, నాయకులు సరిత, రాజన్న, సత్యనారాయణ, రాజేష్‌, ఆర్యవైశ్య సంఘం నాయకులు మురళీ, ఆరె సంఘం నాయకులు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలోని రేచిని గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో తెల్లరాళ్ల గుట్ట వద్ద కొలువైన సమ్మక్క- సారలమ్మ వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ప్రారంభమైన జాతర కోసం మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి బెల్లం సమర్పించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో నెలకొన్న సమ్మక్క సారలమ్మ దర్శణానికి భక్తులు ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా తరలి వచ్చి వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానికి వచ్చిన భక్తులు వన దేవతలకు మొక్కలు చెల్లించి అక్కడే భోజనాలు చేసుకున్నారు. కాగా జాతర ఉత్సవాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నారు. కాగా జాతర ఉత్సవాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై సర్తాజ్‌ పాషా ఆధ్వర్యంలో బందో బస్తు నిర్వహించారు. బెజ్జూరు ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశార

Updated Date - Jan 28 , 2026 | 11:08 PM