Share News

kumaram bheem asifabad- భూసారం.. ఇక పదిలం

ABN , Publish Date - Apr 26 , 2026 | 10:58 PM

భూసార సంరక్షణ, భూసార పరీక్షల అవశ్యకతపై రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించి వారిలో చైతన్యం తెచ్చేందుకు గాను వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే భూసార సంరక్షణకు గాను ప్రతీ రెవెన్యూ గ్రామానికి ము గ్గురు చొప్పున వలంటీర్లను నియమించనుంది. వారి ఎంపిక కోసం జిల్లాలో వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. వారి ద్వారా భూసార సంరక్షణ పరిరక్షణ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టబోతున్నారు.

kumaram bheem asifabad- భూసారం.. ఇక పదిలం
లోగో


- పంటల దిగుబడి దిశగా అడుగులు

- జిల్లాలో 1,227 మంది ఎంపికకు కసరత్తు

వాంకిడి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): భూసార సంరక్షణ, భూసార పరీక్షల అవశ్యకతపై రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించి వారిలో చైతన్యం తెచ్చేందుకు గాను వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే భూసార సంరక్షణకు గాను ప్రతీ రెవెన్యూ గ్రామానికి ము గ్గురు చొప్పున వలంటీర్లను నియమించనుంది. వారి ఎంపిక కోసం జిల్లాలో వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. వారి ద్వారా భూసార సంరక్షణ పరిరక్షణ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టబోతున్నారు. ప్రతీ రైతుకు నేల ఆరోగ్యకార్డు అందించే ప్రక్రియలో భాగంగా ఈ వలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తీసుకు రాబోతున్నారు. రైతులు లేదా ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా మండల వ్యవసాయాధికారులు, మండల విస్తరణఅధికారులు సేకరించిన మట్టి నమూనాలను పరీక్షించి వాటి ఫలితాలను అందిస్తున్నారు. కానీ అవి సకాలంలో రాకపోవడం, వచ్చినా వాటిని రైతులు పాటించకపోవ డంతో ఆశించిన లక్ష్యం నెరవేరడంలేదు.

- మట్టి నమూనాలు సేకరించి..

గ్రామానికి ముగ్గురు వలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన వారు గ్రామాల్లో మట్టి నమూనాలు సేకరించి, భూసార పరీక్షా కేంద్రాలకు పంపించే బాధ్యతను అప్పజెప్పనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 434 రెవెన్యూ గ్రామాలకు గాను మొత్తం 1,227 మందిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 1,151 మంది వలంటీర్లను ఎంపిక చేసినట్లు వ్యవసాయశాఖ అఽధికారులు తెలిపారు. కాగా కనీసం పదో తరగతి పాసై వ్యవసాయంపై అవగాహన కలిగి ఉంది, భూసార సంరక్షణ విష యాలపై ఆసక్తి కలిగి ఉన్నవారిని నియమించనున్నా రు. వారు గ్రామాల్లోకి వెళ్లి రైతులకు భూసార సంరక్షణ, పరీక్షలపైనా సలహాలు, సూచనలు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. భూసార పరీక్షలతో లాభాలు విషయాల గురించి వివరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రామాల్లో రసా యనిక ఎరువులు అధికంగా వాడడం, సంప్రదాయ ఎరువులకు దూరంగా ఉండడం, భూసారం తగ్గి పంటల దిగుబడుల్లో నష్టం రావడం, రైతులు సాగుచేసిన పత్తి, మిర్చి, మొక్కజొన్న, వరి పంల వ్యర్థాలు తగలబెట్టడం వల్ల కలుగుతున్న భూసార నష్టంపై అవగాహన కల్పించాల్సి ఉంది. భూసార పరీక్షలతో భూముల్లో ఉన్న పోషకాలు, లోపాలు గుర్తించి అందుకు అనుగుణంగా పండించాల్సిన పంటలపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉం టుంది. నేలల్లోని చౌడుసమస్యలు, రసాయన ఎరువు లపై ఖర్చు తగ్గించడం, సేంద్రియ ఎరువుల తయా రీ, వినియోగం వంటి విషయలపై వలంటీర్లు సమ గ్ర అవగాహన పెంచుకొని ప్రతీ రైతుకు తెలియజే యాల్సి ఉంటుంది.

వలంటీర్ల ఎంపికకు ఆదేశాలు..

- మిలింద్‌కుమార్‌, ఆసిపాబాద్‌ ఏడీఏ

జిల్లాలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురు చొప్పున వలంటీర్లను ఎంపిక చేయాలని ఆదేశాలు ఉన్నాయి. జిల్లాలోని 434 రెవెన్యూ గ్రామాలకు గాను 1,227 మందిని ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటివరకు 1,151 మందిని ఎంపిక చేశాం. మిగితా వారిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. వీరు క్షేత్రస్థాయిలో వెళ్లి భూసార పరీక్షలు చేపట్టనున్నారు. ఇక నుంచి ఫలితాలు వెంటవెంటనే వచ్చే అవకాశం ఉన్నందున సారమెరిగి సాగు చేపట్టే అవకాశం ఉంది.

Updated Date - Apr 26 , 2026 | 10:58 PM