Share News

kumaram bheem asifabad- సర్‌ ప్రక్రియలో గుర్తించిన లోపాలు సరిచేయాలి

ABN , Publish Date - Aug 04 , 2026 | 10:36 PM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాలు డిజిటలైజేషన్‌ ప్రక్రియలో అనమలీస్‌ జాబితాలో గల పేర్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి లోపాలు ఉంటే సరి చేయాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ రాజస్వ మండల అధికారులుు, చెన్నూరు కృష్ణయ్యలతో కలిసి తహసీల్దార్లు, సూపర్‌వైజర్లతో మంగళవారం సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు.

kumaram bheem asifabad- సర్‌ ప్రక్రియలో గుర్తించిన లోపాలు సరిచేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న ఆర్టీవో లోకేశ్వర్‌రావు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాలు డిజిటలైజేషన్‌ ప్రక్రియలో అనమలీస్‌ జాబితాలో గల పేర్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి లోపాలు ఉంటే సరి చేయాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ రాజస్వ మండల అధికారులుు, చెన్నూరు కృష్ణయ్యలతో కలిసి తహసీల్దార్లు, సూపర్‌వైజర్లతో మంగళవారం సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఓటరు జాబితా ప్రక్రియ సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఓటరు నింపిన ఎన్యూమరేషన్‌ ఫారాలతో వివరాలను బూత్‌ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లు సరి చూసు కోవాలని తెలిపారు. పుట్టిన తేదీ లేక పోవడం, వ్యత్యాసాలు, లింగ వివరాలతో పొరపాట్లు, సంతకాలతో లోపాలు వంటి అనమలీస్‌ లోపాలను సరి చేయాలని సూచించారు. బూత్‌ స్థాయి అధికారులు, బూత్‌ స్థాయి ఏజెంట్లతో నిర్వహించిన సమావేశపు మినిట్స్‌ను బూత్‌ స్థాయి ఏజెంట్ల సంతకాలతో సిద్ధం చేసి వెబ్‌సైట్‌ లో నమోదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరలో ఆసిఫాబాద్‌ నియోజకర్గ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అధికారులతో కలిసి ఈ నెల 9న నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై గిరిజన సంక్షేమ అధికారులు, తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, రాయ్‌ సెంటర్‌ సర్‌మెడీలతో నిర్వహించిన సన్నాహాక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 9న జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలల్లో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పాల్గొనే వారికి తాగునీరు, భోజన వసతి, ఇతర సౌకార్యలు కల్పించాలని సూచించారు. గిరిజన సంక్షేమ అధికారులు కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా సమన్వయంతో పని చేయాలని కోరారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ గిరిజన ఆదివాసీ సంఘాల నాయకులు ఐకమత్యంతో పని చేసి విజయవంతం చేయాలని తెలిపారు. వేడుకల నిర్వహణకు తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారి అంబాజీ, ఆదివాసి సంఘాల ప్రతినిధులు సిడాం అర్జు, బర్సు పోచయ్య, కుర్సింగ మోతీరాం, మడావి నర్సింగ్‌రావు, దస్రు, కొడ్ప విశ్వేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 10:36 PM