kumaram bheem asifabad- ‘సర్’ పూర్తిలో కాంగ్రెస్ నాయకుల కృషి అభినందనీయం
ABN , Publish Date - Aug 18 , 2026 | 10:53 PM
సర్ ప్రక్రియలో సిర్పూరు నియోజక వర్గం రాష్ట్రంలోనే భేష్ నిలిచిందని, దీని కోసం కాంగ్రెస్ నాయకుల కృషి అభినందనీయమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని రన్ గ్రౌండులో సర్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాగజ్‌నగర్, ఆగస్టు 18 (ఆంఽధ్రజ్యోతి): సర్ ప్రక్రియలో సిర్పూరు నియోజక వర్గం రాష్ట్రంలోనే భేష్ నిలిచిందని, దీని కోసం కాంగ్రెస్ నాయకుల కృషి అభినందనీయమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని రన్ గ్రౌండులో సర్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ ప్రక్రియ అత్యంత బాధ్యత యుతంగా, పారదర్శకంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటు జాబితాలో ఉండేలా చూడడడంతో పాటు ప్రతి బూత్ స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన జరుపాలని సూచించారు. సిర్పూరు నియోజకవర్గంలో సర్ ప్రక్రియ పగడ్బందీగా నిర్వహించి రాష్ట్రంలోనే బెస్ట్ నియోజకవర్గంగా నిలిపిన వారిని ప్రశంసించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటరు గల్లంతు కాకుండా బీఎల్‌ఓ, నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక కృషి చేసినట్టు వివరించారు. ప్రణాళిక బద్దంగా ఈ ప్రక్రియను చేపట్టడంతో వంద శాతం పూర్తి చేసినట్టు వివరించారు. గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్‌ఎలు క్షేత్ర స్థాయిలో చురుగా పని చేయాలన్నారు. ప్రతి ఓటరు తమ వివరాలను పరిశీలించుకోవాలని అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనపంతరం కాగజ్‌నగర్ మండలం అంకుసాపూర్, తట్టుగూడెం మధ్య రూ.8.50 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన హైలెవల్ వంతెన నిర్మాణానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శంకుస్థాపన చేపట్టారు. సమావేశం ఆరంభం ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన నాయకులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, తమకు అన్యాయం చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో మంత్రి సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్ మున్సిపల్ చైర్మన్ షాషీన్‌సుల్తాన, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య, మంగ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.