Share News

పేదల సొంతింటి కల సాకారం

ABN , Publish Date - Oct 14 , 2026 | 11:28 PM

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొం తింటి కల సాకారమవుతోందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

పేదల సొంతింటి కల సాకారం
చెన్నపురావుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేస్తున్న మంత్రి జూపల్లి

- చెన్నపురావుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశాల్లో మంత్రి జూపల్లి

పెద్దకొత్తపల్లి, అక్టోబరు 14 (ఆంధ్ర జ్యోతి) : ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొం తింటి కల సాకారమవుతోందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పెద్దకొత్తపల్లి మం డలం చెన్నపురావుపల్లి గ్రామంలో ని ర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశ కార్యక్ర మంలో బుధవారం మంత్రి జూపల్లి కృ ష్ణారావు పాల్గొన్నారు. లబ్ధిదారులతో గృహప్ర వే శాలు చేయించారు. నూతన గృహాల్లోకి అడుగు పెట్టిన లబ్ధిదారులకు ఆయన నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పాలమూ రు- రంగారెడ్డి పథకంలో నీటి విడుదలకు వెళ్తు న్న కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మంత్రితో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్‌ చెంది వెంకటమ్మ, ఉప సర్పంచ్‌ నాగరాజు, కాం గ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వన్నోజు సత్యం, మాజీ ఎంపీపీలు సూర్యప్రతాప్‌గౌడ్‌, వెంకటేశ్వ ర్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దండు నరసిం హ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ నాగపూరి విష్ణు, నాయకులు గోపాల్‌రావు, చెం ది వెంకటస్వామి, గుమ్మకొండ రమేష్‌, రవికు మార్‌, శివ, రాజేశ్వర్‌రావు, ఎండీ సలీం, బి. విష్ణు, రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 11:28 PM