పేదల సొంతింటి కల సాకారం
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:58 PM
ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నె రవేరుతోందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నా రు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
ఉప్పునుంతల, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నె రవేరుతోందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నా రు. ఆదివారం మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో ఆయన లబ్దిదారులతో కలిసి ప్రారంభించి గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అ నంతరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మీనారా యణ, నాయకులు నరసింహారావు, గోవర్ధన్‌రెడ్డి, నరసింహారెడ్డి,సర్పంచ్‌శ్రీనివాసులు పాల్గొన్నారు.
అక్రమాలను నివారించడానికే సర్
వంగూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : ఎన్ని కల ఓటరు జాబితాలో అక్రమాలను నివారించి అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించ డమే సర్ ప్రక్రియ అని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మండలంలోని వెల్మలపల్లి గేటు వద్ద ఓ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఓటరు మ్యాపింగ్ ప్రక్రియపై అ వగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సా రించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, యాదగిరిరావు, రమేష్‌గౌడ్, జనార్దన్ పాల్గొన్నారు.