ఇందిరమ్మ రాజ్యంలో సొంతింటి కల సాకారం
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:07 PM
ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కాల సాకారం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే కోక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు.
ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
దండేపల్లి జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కాల సాకారం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే కోక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా దం డేపల్లి మండలం ధర్మరావుపేట గ్రామానికి చెందిన కొల్లూరి సుజాత మల్లేష్, కొల్లూరి శ్వేత మధుకర్ దంపతులు ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటి నిర్మాణం పూర్తయిన సందర్బంగా ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజల నడుమ గృహ ప్రవేశం చేసి, ఆ శీర్వదించారు. లబ్దిదారులకు వ్యక్తిగతంగా కానుకలు అందజేశారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వంలో పేద ప్రజలకల నెరవేర్చ డమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఽఏళ్లుగా పేదలు పాత ఇళ్లు, గుడిసెలు, రేకుల షెడ్లలోనే కాలం వెళ్లదీస్తూ వచ్చారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వ చ్చాక ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ 5లక్షలతో సొంతింటిని నిర్మించి ఇవ్వడంపై పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. దశల వారిగా ఇళ్లు లేని ప్రతీ ఒక్కరికి ఇం దిరమ్మ పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. దర్మారావుపేటలో గుడిసెలేలు లేని గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పరిపా లనలో నిరుపేదలకు ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని విమ ర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికి పేదలు ఇబ్బంది పడకూడదనే ఉ ద్దేశంతోనే సన్నబియ్యం పంపిణీతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతోంద న్నారు, కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ప్రేమ్‌చందు, సర్పంచ్ కొత్తఽ దర్మయ్య, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, హుసింగ్ పిడి బాన్సిలాల్, ఏఈ అమీర్‌ఖాన్, తహ సీల్దార్ రోహిత్‌దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్, మాజీ ఎంపీపీలు శకుంతల, గురువ య్య, కాంతరావు, పంచాయతీ కార్యదర్శి సనంద, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.