కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేరుతున్న సొంతింటి కల
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:53 PM
కాంగ్రెస్ ప్రభుత్వంలో పే దోడి సొంతింటి కల నెరవేరుతోందని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి
కందనూలు/ తిమ్మాజిపేట/ తాడూరు, జూ లై 5 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వంలో పే దోడి సొంతింటి కల నెరవేరుతోందని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. మండల పరిధి లోని మరిక గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని లబ్ధి దారునితో కలిసి ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఏ గ్రామంలోనూ రెండు పడక గదు లు నిర్మించలేదన్నారు. ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి అం దుతున్నాయ న్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి వెంకటరామి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్యగౌడ్, మాజీ సర్పంచ్ నరసింహయాదవ్, నాయకులు లక్ష్మీనారాయణ, రవూఫ్, లింగం, రామ్మోహన్, నాగసాయిలు, శివ, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రయ్య, సహదేవ్ పాల్గొన్నారు.
లింగమయ్య విగ్రహ ప్రతిష్ఠాపన
నాగర్‌కర్నూల్ మం డల పరిధిలోని శ్రీపురం గ్రామంలో ఆదివారం లింగమయ్య విగ్రహ ప్ర తిష్ఠాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎ మ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి పూజలు నిర్వహిం చారు. కార్యక్రమంలో సర్పంచ్ గీతనరసింహా రెడ్డి, ఉప సర్పంచ్ జూపల్లి వెంకటయ్య, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుడికి పరామర్శ
తాడూరు మండలంలోని యత్మతాపూర్ గ్రా మంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లయ్యకు కాలు విరగడంతో కొన్ని రోజులుగా ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆదివారం ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మల్లయ్య ఇంటికెళ్లి పరామర్శించారు. బాధితునికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఎమ్మెల్యే వెంట యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వినోద్‌కుమార్, స్థానిక నాయకులు నరేందర్‌రెడ్డి, ప్రసాద్‌గౌడ్ పాల్గొన్నారు.