kumaram bheem asifabad-పేదలకు సొంతింటి కల సాకారం
ABN , Publish Date - Apr 10 , 2026 | 10:50 PM
పేదలకు సొంతింటి కల సాకారం కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జైనూర్ మార్కెట్ కమిటి చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావ్ అన్నారు. మండలంలోని ఉషేగాంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం కార్యక్రమంలో తహసీల్దార్ ఆడ బీర్షావ్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావ్, మాజీ వైస్ ఎంపీపీ షేక్ చిర్లే లక్ష్మణ్, జిల్లా సీనియర్ నాయకులు మేస్రాం అంబాజీరావ్, జన్నావార్ పవన్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
జైనూర్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): పేదలకు సొంతింటి కల సాకారం కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జైనూర్ మార్కెట్ కమిటి చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావ్ అన్నారు. మండలంలోని ఉషేగాంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం కార్యక్రమంలో తహసీల్దార్ ఆడ బీర్షావ్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావ్, మాజీ వైస్ ఎంపీపీ షేక్ చిర్లే లక్ష్మణ్, జిల్లా సీనియర్ నాయకులు మేస్రాం అంబాజీరావ్, జన్నావార్ పవన్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్‌రావ్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కుంరంభీం జిల్లాలో దశల వారీగా ఇందిరమ్మ గృహలను ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. మరి కొన్ని రోజుల్లో జిల్లాలో వేలాది గృహలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇళ్లను నాణ్యతగా నిర్మించుకోవాలని కోరారు. ఇళ్ల బిల్లులు సకాలంలో రాకుటే తమకు సమాచారం అందించాలని, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలో బిల్లులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు ఆత్రం నిర్మల బాయి, మేస్రాం భూపతి. మాజీ ఎంపీటీసీ ఆత్రం శశిపాల్, ఎంపీవో శషికుమార్ తదితరులు పాల్గొన్నారు.