నెరవేరుతున్న పేదల సొంతింటి కల
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:26 PM
అచ్చంపేట పట్టణంలోని రాజీవ్‌నగ ర్ కాలనీలో లబ్ధిదారుడు భాస్కరాచా రి ఇందిరమ్మ ఇంటి ప్రవేశానికి స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ గురువా రం హాజరయ్యారు.
- ఇందిరమ్మ ఇంటి ప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట, జూన్ 4 (ఆంధ్రజ్యోతి) : అచ్చంపేట పట్టణంలోని రాజీవ్‌నగ ర్ కాలనీలో లబ్ధిదారుడు భాస్కరాచా రి ఇందిరమ్మ ఇంటి ప్రవేశానికి స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ గురువా రం హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో నిరుపేదల సొంతింటి కల నెరవే రిందని అన్నారు. సంబురాలు అంబరాన్నంటా యని అన్నారు.
ఫ అచ్చంపేట పట్టణంలోని మూడవ వార్డు దర్శన్‌గడ్డలో ఎమ్మెల్యే వంశీకృష్ణ బుధవారం పర్యటించారు. దర్శన్‌గడ్డలో కాలనీవాసులు ప లు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురా వడంతో అక్కడే ఉన్న మునిసిపల్ కమిషనర్, అధికారులను వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడికి నివాళి
ఉప్పునుంతల, జూన్ 4 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని రాయచేడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సింగిల్ విండో డైరెక్టర్ బోడ లింగమయ్య మరణించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే చిక్కు డు వంశీకృష్ణ బుధవారం బోడ లింగమయ్య పార్థివదేహంపై పూల మాల వేసి నివాళులర్పిం చారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా నిచ్చారు. వారికి కొంత ఆర్థిక సహాయం అందజే శారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ దొడ్ల నరసయ్య యాదవ్, గ్రామ సర్పంచ్ ఆనంద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.