క్రీడలకు పుట్టినిల్లుగా జిల్లాకు పేరు రావాలి
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:39 PM
క్రీడలకు పుట్టిని ల్లుగా నాగర్‌కర్నూల్ జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి క్రీడాకారుల కు సూచించారు.
- జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి
ఊర్కొండ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : క్రీడలకు పుట్టిని ల్లుగా నాగర్‌కర్నూల్ జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి క్రీడాకారుల కు సూచించారు. ఆదివారం మండ ల కేంద్రంలోని మైదానంలో నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆద్వర్యం లో జిల్లా కబడ్డీ ఎంపికలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయ న మాట్లాడుతూ జిల్లాలో ఎంతోమంది క్రీడాకా రులున్నారని, వారికి ప్రోత్సాహంలేక ముందుకు వెళ్లలేక పొతున్నారని, అటువంటి వారికి ఎల్లవే ళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలి పారు. జిల్లాను క్రీడలఖిల్లాగా మార్చడమే ల క్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈరోజు ఎంపికైన బాలుర జూనియర్ జట్టు, సబ్ జూనియర్ బా లికల జట్టు సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఈ నెల 26 నుంచి 29 వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని, అదేవిధంగా జూనియర్ బాలికల జట్టు ఖమ్మం జిల్లా ఆశ్వరావుపేటలో వచ్చే నెల 10 నుంచి 13 వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపి యన్ షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదయ్యగౌడ్ సభ్యులు శ్రీనివాసు లు, రమేష్, ఢాక్య, మోహన్, ప్రసాద్ వ్యాయా మ ఉపాధ్యాయులు జ్యోతి, భారతి, గణేశ్వరి, సుజాత, కలీంపాషా, సందీప్‌కుమార్ ఉన్నారు.