Share News

జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:21 PM

జిల్లాలో వర్షాభావ ప రిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయ కుడు డాక్టర్‌ నాగం శశిధర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నాగం శశిధర్‌రెడ్డి

- బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ నాగం శశిధర్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వర్షాభావ ప రిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయ కుడు డాక్టర్‌ నాగం శశిధర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవా రం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శశిధర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ సంక్షోభానికి వర్షాభావంతో పాటు ప్రభుత్వ వైఫల్యం కూడా కారణమని విమర్శించారు.నాగర్‌కర్నూల్‌ నియో జకవర్గంలో ప్రస్తుతం ప్రభుత్వం బిజినేపల్లి మండలాన్ని మాత్రమే కరువు మండలంగా ప్ర కటించడం సరికాదని, నాగర్‌కర్నూల్‌, తిమ్మాజి పేట, తాడూరు, తెల్కపల్లి మండలాల్లోనూ తీవ్ర వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ప్రతీ ఎకరాకు రైతులకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని, కౌ లు రైతులను కూడా ఆదుకోవాలని ఆయన డి మాండ్‌ చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నా యకులు అర్థం రవి, బాలాగౌడ్‌, ఐతోలు లక్ష్మ య్య, కౌన్సిలర్‌ అర్జునయ్య, నాగనూలు సుబ్బ య్య, సత్యం, భీముడు, కరుణాకర్‌, రాజు, వెంకటస్వామి, అహ్మద్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 11:21 PM