kumaram bheem asifabad-మురిసిన అవని
ABN , Publish Date - Jan 04 , 2026 | 10:38 PM
అవని అందాల ముగ్గులతో మురిసింది. ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీల్లో మహిళలు తెలంగాణ, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేసిన ముగ్గులు పది రోజుల ముందే సంక్రాంతి రంగుల హరివిల్లును ఆవిష్కరించింది. ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్ బై.. సన్‌ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగరబత్తి’ సహకారం, స్థానిక సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్‌పీఎం) సౌజన్యంతో కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్‌పీఎం క్లబ్‌లో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి.
- ఆకట్టుకున్న రంగవల్లులు
- ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, యువతలు
కాగజ్‌నగర్/కాగజ్‌నగర్‌టౌన్/ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌రూరల్, జనవరి 4 (ఆంధ్రజ్యో తి): అవని అందాల ముగ్గులతో మురిసింది. ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీల్లో మహిళలు తెలంగాణ, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేసిన ముగ్గులు పది రోజుల ముందే సంక్రాంతి రంగుల హరివిల్లును ఆవిష్కరించింది. ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్ బై.. సన్‌ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగరబత్తి’ సహకారం, స్థానిక సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్‌పీఎం) సౌజన్యంతో కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్‌పీఎం క్లబ్‌లో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. ఈ ముగ్గుల పోటీలకు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నలుమూలల నుంచి సుమారు 85 మంది మహిళలు, యువతులు, విద్యార్థినులు, చిన్నారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. మహిళలు వేసిన ముగ్గులు అందమైన హరవిల్లును తలపించేలా అవనిపై మెరిశాయి. పోటాపోటీగా సాగిన ఈ ముగ్గుల పోటీల్లో కాన్సెప్ట్, థీమ్ తదితర అంశాల్లో అత్యుత్తమంగా వేసిన ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన జి మీనాక్షి మొదటి బహుమతి, తిర్యాణి మండలానికి చెందిన వై జయ ద్వితీయ, కాగజ్‌నగర్ పట్టణానికే చెందిన టి సంధ్యారాణి తృతీయ స్థానంలో నిలిచి బహుమతులు గెలుపొందారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 85 మంది మహిళలు, యువతులు, చిన్నారులు తరలి వచ్చి పోటీల్లో పాల్గొన్నారు. వివిధ రకాల ప్రత్యేకతలతో సంక్రాంతి పండగను మరిపించేలా వేసిన వైవిద్యమైన రంగవళ్లులు ఆకట్టుకున్నాయి. కాన్సెప్ట్‌లతో వేసిన 85 రకాల ముగ్గులను న్యాయ నిర్ణేతలు క్షుణ్ణంగా పరిశీలించి విజేతలను నిర్ణయించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా డాక్టర్ అనిత, న్యాయవాది శశిరేఖ, సామంతుల రాణి వ్యవహరించారు. బహుమతుల ప్రదానోత్సవానికి స్థానిక సిర్పూర్ పేపర్ మిల్లు చీఫ్ మేనేజర్ రమేశ్‌రావు, సీనియర్ న్యాయవాది వి కిశోర్‌కుమార్ దంపతులు విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌పీఎం చీఫ్ మేనేజర్ రమేష్‌రావు మాట్లాడుతూ ముగ్గులు కేవలం మానసిక ఉల్లాసానికే కాకుండా శారీరక వ్యామయానికి కూడా ఉపకరిస్తాయని చెప్పారు. అంతే కాకుండా కల్లాపి చల్లిన తరువాత ముగ్గులు వేయడంలో చాలా లోతైన అర్థం ఉందని కల్లాపి చల్లడం వల్ల బ్యాక్టీరియా ఇళ్లలోకి రాకుండా అడ్డుకోవచ్చని ముగ్గులుగా వేసే పిండి వల్ల మన చుట్టు కంటికి కనిపించన సూక్ష్మజీవులకు ఆహారంగా ఉపయోగపడుతుం దని, తాను బతుకుతూ ఇతర జీవులను బతికించడమే ఈ ముగ్గుల అంతరార్థమని చెప్పుకొచ్చారు. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మక కళాతృష్ణను వెలికి తీయడంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చూపుతున్న చొరవ ప్రశంసనీయమని చెప్పారు. వార్తలోనే కాదు ప్రజలకు సేవ చేయడంలోనూ ముందుండడం శుభపరిణామమని అభిపాయ పడ్డారు. కార్యక్రమంలో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎ కృష్ణంరాజు, రిపోర్టర్లు ఎస్ వేణుగోపాల్, వీటీ చారి, గందం శ్రీనివాస్, సయ్యద్ నాజీర్ అలీ, శ్రీధర్, వెంకటేష్, ఏబీఎన్ రిపోర్టర్ నాగార్జున, స్పర్శ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సుశీల, పీఈటీ అనిల్, అశోక్, సత్యనారాయణ, కేజీబీవీ ప్రిన్సిపల్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
- ముఖ్య అతిథులకు సన్మానం..
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీల్లో పాల్గొన్న న్యాయనిర్థేతలతో పాటు ముఖ్య అతిథితులను ఆంధ్రజ్యోతి బృందం శాలువాలతో సత్కరించారు. అనంతరం లోగో ముగ్గులు వేసిన చిన్నారి ధర్ని అపూర్వకు ముఖ్య అతిథులు, న్యాయనిర్ణేతలు, స్పాన్సర్లు ఎస్‌పీఎం చీఫ్ మేనేజర్ రమేశ్‌రావు, న్యాయవాదులు కిశోర్‌కుమార్, శశికళ, సామంతుల రాణి, డాక్టర్ అనితలు ప్రత్యేక బహుమతులు అందజేశారు.