Share News

శాసన సభ గౌరవాన్ని కాపాడాలి

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:28 PM

శాసనసభ గౌరవం,ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

శాసన సభ గౌరవాన్ని కాపాడాలి
మంత్రి శ్రీధర్‌బాబు, శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌లను కలిసిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి

- స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే కశిరెడ్డి

కల్వకుర్తి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : శాసనసభ గౌరవం,ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీలో నాగర్‌కర్నూల్‌ ఎం పీ మల్లురవితో కలిసి రాష్ట్ర అసెంబ్లీ వ్యవ హారాల ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బా బు, శాసనసభ స్పీకర్‌ గడ్డంప్రసాద్‌ కుమా ర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవ ల ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై చేసిన అను చిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్‌బాబును కలిసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Sep 09 , 2026 | 11:28 PM