యాదవుల అభివృద్ధే లక్ష్యం..
ABN , Publish Date - Aug 08 , 2026 | 11:18 PM
రాష్ట్రంలో యాదవుల అభి వృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తుందని అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ తెలిపారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు.
సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం
మందమర్రిటౌన్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో యాదవుల అభి వృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తుందని అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ తెలిపారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. యాదవుల హక్కుల సాధనే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని పే ర్కొన్నారు. అంతేకాకుండా ఆయా రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న యాద వులకు, జనాభా నిష్పత్తి ప్రకారం పదవులు కూడా ఇవ్వాలన్నారు. త్వరలో నే జిల్లాలో యాదవ మహాసభ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇందులో భాగంగా మండల, పట్టణ కమిటీలను ఎన్నుకుంటామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశం మేరకు కమిటీలను ఎంపిక చేస్తామన్నారు. యా దవుల సమస్యలను రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ సమావేశంలో జిల్లా యూత్ అధ్యక్షుడు గంగాధర్ యాదవ్, ఉపాధ్యక్షుడు అల్లంల పవయ్య, నాగన్న, నాయకులు మల్లేష్, గోపాల్, కత్తెర్ల సంజీవ్, సత్తన్న, సంజీవ్, ఐలయ్య, రాజన్న, రాములు, పోశం, నాగవేణి కృష్ణ యాదవ్ పాల్గొన్నారు.