Share News

గుప్పుమంటున్న గుడుంబా...

ABN , Publish Date - May 02 , 2026 | 09:39 PM

రాష్ట్రంలో నిషేద జాబితాలో ఉన్న గుడుంబా మళ్లీ నివురుగక్కిన నిప్పు లా దూసుకుపోతోంది. కొంతకాలం పాటు జిల్లాలో పూ ర్తిగా నిషేధంలో ఉన్నప్పటికీ రెండేళ్లుగా విపరీతంగా విజృంభిస్తోంది.

గుప్పుమంటున్న గుడుంబా...

-పల్లెల్లో విపరీతంగా దర్శనమిస్తున్న స్థావరాలు

-దాడులు జరుగుతున్నా ఆగని తయారీ

-జిల్లా వ్యాప్తంగా జిల్లాలో 315 కేసులు నమోదు

-స్పెషల్‌ డ్రైవ్‌తో చెక్‌ పెట్టేందుకు యత్నాలు

మంచిర్యాల, మే 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిషేద జాబితాలో ఉన్న గుడుంబా మళ్లీ నివురుగక్కిన నిప్పు లా దూసుకుపోతోంది. కొంతకాలం పాటు జిల్లాలో పూ ర్తిగా నిషేధంలో ఉన్నప్పటికీ రెండేళ్లుగా విపరీతంగా విజృంభిస్తోంది. జిల్లాలో వందల సంఖ్యలో గుండా స్థా వరాలు ఏర్పడ్డాయంటే అతిశయోక్తికాదు. ముఖ్యంగా మారుమూల మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల పరి ధిలో పెద్ద మొత్తంలో గుడుంబా తయారవుతున్నట్లు తెలుస్తోంది. వరుసగా దాడులు జరుగుతున్నా జంకని ఉత్పత్తిదారులు అధికారుల కళ్లుగప్పి గుట్టుచప్పుడు కా కుండా తమ పనిని కానిస్తున్నారు. జిల్లాలోని మంచి ర్యాల, లక్షెట్టిపేట, చెన్నూర్‌, బెల్లంపల్లి ఎక్సయిజ్‌ స్టేష న్‌ల పరిధిలో దాదాపు నిత్యం గుడుంబా పట్టుబడు తున్న కేసులు నమోదవుతున్నాయి.

ఏరులైపారుతున్న గుడుంబా...

బెల్లం పానకం, స్పటికతో కూడిన గుడుంబా జిల్లా లో ఏరులై పారుతోంది. కోటపల్లి, మందమర్రి, జన్నా రం, వేమనపల్లి, నెన్నెల, తదితర మండలాల పరిధిలో వందల సంఖ్యలో స్థావరాలు ఉన్నట్లు ఎక్సయిజ్‌శాఖ అధికారులు గుర్తించారు. స్థావరాలపై మూకుమ్మడి దా డులు జరుపుతూ పెద్దమొత్తంలో గుడుంబాను స్వాధీ నం చేసుకుంటున్నారు. ఇటీవల గుడుంబా స్థావరాల పై జరుగుతున్న దాడుల సంఖ్య క్రమేపి పెరుగుతోం ది. జిల్లా కేంద్రంలోని పలు హోల్‌సేల్‌ దుకాణాల్లో గం ప గుత్తగా బెల్లం, పటిక కొనుగోలు చేస్తూ స్థావరాలకు తరలిస్తున్నారు. అనంతరం మారుమూల ప్రాంతాల్లో ప్రత్యేక బట్టీలు ఏర్పాటు చేసి గుడుంబా తయారీ చే స్తున్నారు. ఆయా గ్రామాల్లోని కొందరు కేవలం గు డుంబా తయారీనే ప్రధాన వృత్తిగా పెట్టుకున్నట్లు తె లుస్తోంది. అలా తయారీ చేసిన గుడుంబాను ఆటోలు, ద్విచక్రవాహనాల ద్వారా గమ్యాలకు చేరవేస్తూ సొ మ్ము చేసుకుంటున్నారు.

జిల్లాలో 315 కేసులు నమోదు...

జిల్లాలోని నాలుగు ఎక్సయిజ్‌ స్టేషన్ల పరిధిలో జన వరి 1 నుంచి గత నెల 30వ తేదీ వరకు ఏకంగా 315 కేసులు నమోదుకావడం గమనార్హం. గుడుంబా త యారు చేసి విక్రయాలు జరుపుతున్న 279 మందిని ఈ సందర్భంగా ఎక్సయిజ్‌ అదికారులు పట్టుకొని వా రిపై కేసులో నమోదు చేశారు. జిల్లాలోని వివిధ స్థా వరాల వద్ద తయారు చేస్తున్న 1,110 లీటర్ల గుడుం బా, 11,110 లీటర్ల బెల్లం పానకం, 1920 కిలోల బెల్లం, 75 కిలోల పటిక పాటు 135 వాహనాలను ఎక్సయిజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయా స్థావరా ల్లో పెద్ద ఎత్తున గుడుంబా తయారీ చేస్తున్నారనే స మాచారం మేరకు అధికారులు తరుచుగా దాడులు జరుపుతున్నా గుడుంబా తయారీ ఆగకపోవడం గమనార్హం.

స్పెషల్‌ డ్రైవ్‌తో చెక్‌ పెట్టే యత్నం...

జిల్లా వ్యాప్తంగా గుడుండా తయారీ, అక్రమ రవా ణాకు చెక్‌ పెట్టేందుకు ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో గత నెలలో స్పెషల్‌ డ్రైవ్‌ సైతం చేపట్టారు. ఇందులో ఎక్సై జ్‌శాఖతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ టీం, డిస్ట్రిక్ట్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, పోలీస్‌ శాఖ సహకారంతో సంయుక్త దాడులు జరిపి అక్రమ వ్యాపారాన్ని సమూలంగా తుడిచివేసే ప్రయత్నం చే శారు. స్పెషల్‌ డ్రైవ్‌ కొంతమేర ఫలితాలను ఇచ్చినప్ప టికీ జిల్లాలో గుడుంబా పూర్తిస్థాయిలో అంతం కాలేదనే చెప్పాలి.

గుడుంబా తయారు చేయడం నేరం...

ఎక్సయిజ్‌ సూపరింటెండెంట్‌ నందగోపాల్‌

నిషేధిత గుడుంబాను తయారు చేయడం, విక్ర యించడం చట్టరీత్యా నేరం. ప్రత్యేక స్థావరాలు ఏర్పా టు చేసి గుడుంబా తయారు చేస్తున్నవారిని ఎట్టి పరి స్థితుల్లో ఉపేక్షించేది ఉండదు. గుడుంబా స్థావరాలపై ఇప్పటికే పర్యవేక్షణ పెంచడం జరిగింది. బెల్లం, పటిక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. గు డుంబాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం.

Updated Date - May 02 , 2026 | 09:39 PM