kumaram bheem asifabad- మోదీ పాలనలో దేశం అభివృద్ధి
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:26 PM
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాఽధించిందని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ హాయంలోనే ఆవాస్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ఉజ్వల యోజన, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి పథకాలు అమలయ్యాయని చెప్పారు.
కాగజ్‌నగర్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాఽధించిందని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ హాయంలోనే ఆవాస్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ఉజ్వల యోజన, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి పథకాలు అమలయ్యాయని చెప్పారు. ఈ పథకాల ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు వెచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు నామని మహేష్ మాట్లాడుతూ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ రక్షణ రంగానికి అధికంగా నిధులు కేటాయించినట్టు వివరించారు. అన్ని రాష్ట్రాలకు అనుసంధానంగా ఉండేందుకు జాతీయ రహదారులను నిర్మించారని చెప్పారు. నిరుపేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టినట్టు గుర్తు చేశారు. భారత్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన ఘనత మోదీకి దక్కుతుందని కొనియాడారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరభద్రచారి, కౌన్సిలర్ ఈర్ల విశ్వేశ్వర్ రావు, గజ్జల లావణ్య, సర్పంచులు ఓడెటి నానయ్య, తేలిబాపు, మండల అద్యక్షులు పుల్లా ఆశోక్, కుంచాల విజయ్, జాడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.