ప్రధాని మోదీ నాయకత్వంలో దేశానికి ప్రత్యేక గుర్తింపు
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:48 AM
ప్రపంచంలోనే భారత దేశానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక గుర్తింపు తీసుకవచ్చారని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని సోమవారం రాత్రి
సిరిసిల్ల అర్బన్, జూన్ 22 (ఆంఽధ్రజ్యోతి): ప్రపంచంలోనే భారత దేశానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక గుర్తింపు తీసుకవచ్చారని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని సోమవారం రాత్రి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ కేంద్ర, రాష్ట్ర పార్టీల అదేశాల మేరకు సిరిసిల్లలో మేధావుల సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా జాతీయ కౌన్సిల్ సభ్యులు గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12సంవత్సరాలు భారత ప్రధానమంత్రిగా సేవలందిస్తూ దాదాపు 25 సంవత్సరాలుగా నిరంతర ప్రజా సేవలో కొనసాగుతున్న గొప్ప నాయకుడన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రజల ఆశీస్సులతో దేశ అత్యున్నత పదవి అధిరోహించి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడిగా మోదీ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన మేధావులు, వివిధ రంగాల ప్రము ఖులను జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా భీమనపల్లి శ్రీలత, ఆడెపు లత, వేముల శ్రీలత, బండారు దివ్యలకు పార్టీ నాయకులు శాలువాలు కప్పి అభినందించారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతి, సిరికొండ శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర నాయకులు గరిపెల్లి ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లారపు సంతోష్ రెడ్డి, బర్కం వెంకటలక్ష్మీనవీన్ యాదవ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, అయ్యప్పస్వామి ఆలయ చైర్మన్ రాచర్ల విద్యా సాగర్ స్వామి, టెక్స్‌టైల్ పార్క్ చైర్మన్ అన్నదాసు అనిల్, పైవ్రేట్ విద్యాసంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, సెన్సార్ బోర్డు సభ్యురాలు వేముల వైశాలి తదితరులు ఉన్నారు.