కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:54 PM
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కు మార్ దీపక్ అన్నారు. గురువారం పట్ట ణంలోని బజార్ ఏరియాలోని జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ ట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించి మా ట్లాడారు.
బెల్లంపల్లి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కు మార్ దీపక్ అన్నారు. గురువారం పట్ట ణంలోని బజార్ ఏరియాలోని జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ ట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించి మా ట్లాడారు. అధికారులం దరు సమన్వయం తో విధులు నిర్వహించాలన్నారు. కౌంటిం గ్ సిబ్బందికి అవసరమైన తాగునీరు, ఇ తర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నా రు. అనంతరం పట్టణంలోని రాంనగర్ ప్రాంతంలో చేపడుతున్న ప్రభుత్వ ప్రాథ మిక పాటశాల నిర్మాణ పనులను పరి శీలించి త్వరగా పనులను పూర్తి చేయాల ని సూచించారు. ఈకార్యక్రమంలో సబ్ క లెక్టర్ మనోజ్, మున్సిపల్ కమీషనర్ సం పత్, తహసీల్దార్ కృష్ణ పాల్గొన్నారు.
సబ్ కలెక్టర్ కార్యాలయం కోసం స్థలం గుర్తించాలి
సబ్ కలెక్టర్ కార్యాలయం సొంత భవన నిర్మాణం కోసం స్థలాన్ని గుర్తించాలని క లెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూ చించారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యా లయాన్ని సందర్శించారు. డివిజన్ పరిధి లో కొనసాగుతున్న పనులు, ప్రజా సంక్షే మ పథకాల అమలు అంశాలను అధికా రులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను, ప్రజా సంక్షేమ కార్యక్రమాల ను పకడ్బందీగా చేపట్టాలన్నారు. అలాగే సబ్ కలెక్టర్ భవనం నిర్మాణం కోసం త్వర గా స్థలాన్ని గుర్తించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ మనోజ్, అధికారులు ఉన్నారు.