Share News

కార్పొరేషన్‌ బడ్జెట్‌లో ప్రజలకు తీవ్ర అన్యాయం

ABN , Publish Date - Mar 29 , 2026 | 11:41 PM

మంచిర్యాల మున్సి పల్‌ కార్పొరేషన్‌ బడ్జెట్‌ కేటాయింపులో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిం దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పేర్కొన్నారు.

కార్పొరేషన్‌ బడ్జెట్‌లో ప్రజలకు తీవ్ర అన్యాయం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల మున్సి పల్‌ కార్పొరేషన్‌ బడ్జెట్‌ కేటాయింపులో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిం దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఆది వారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం లో మాట్లాడారు. కార్పోరేషన్‌ ప్రజల ఆశలు నెరవేర్చుతూ వారి అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయిస్తారని కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు పట్టం కడితే కేవలం 3 డివిజన్‌లకే కోట్ల రూపాయల నిధులను కేటాయించి మిగితా డివిజన్‌లకు, కొత్తగా ఏర్పడిన విలీన గ్రామాల డివిజన్‌లకు అరకొరగా ని ధులు కేటాయించి ప్రజలను మోసం చేశారన్నారు. 45 నిమిషాలు మాత్ర మే బడ్జెట్‌పై చర్చలు జరిపి బడ్జెట్‌ను ఆమోదింప చేసుకుని కనీసం బడ్జె ట్‌పై మాట్లాడే అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వలేదన్నారు. ఇష్టం వ చ్చినట్లు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తూతూ మంత్రంగా జిల్లా అదనపు కలెక్టర్‌ సమక్షంలో ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రా వు పక్షపాత వైఖరితో బడ్జెట్‌ప్రవేశపెట్టినట్లు ఉందన్నారు. రూ. 78 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెడితే కేవలం మూడు డివిజన్‌లకే కోట్ల రూపాయలు కేటా యించడం పట్ల ఆంతర్యమేమిటో చెప్పాలన్నారు. కాంట్రాక్టు లేకుండా అడ్డ గోలుగా ఇష్టం వచ్చినట్లు మంచిర్యాల మార్కెట్‌లో రోడ్డు వెడల్పు పే రుతో కోట్ల రూపాయలు దండుకునే విధంగా బడ్జెట్‌ఉందన్నారు. ఎమ్మెల్యే కేవలం కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లకు లబ్ది చేకూర్చే విధంగా వ్యవహరిస్తు న్నారన్నారు. మంచిర్యాలలో సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన హామీల ను ఎమ్మెల్యే నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. ఈ సమావేశంలో నా యకులు వెంకటేశ్వర్‌రావు, కమలాకర్‌రావు, శ్రీధర్‌, రాజ్‌కుమార్‌, సత్యనా రాయణ, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 11:41 PM