Share News

kumaram bheem asifabad- అలిన్‌కో సంస్థ సహకారం అభినందనీయం

ABN , Publish Date - May 13 , 2026 | 11:22 PM

జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సహయ ఉపకరణాలు అందించడంలో అలిన్‌కో సంస్థ ముందుకు రావడం అభినందనీ యమని కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలోబుధవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి హజరై మాట్లాడారు

kumaram bheem asifabad- అలిన్‌కో సంస్థ సహకారం అభినందనీయం
పిల్లలకు ఉపకరణాలు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 13 (ఆంద్రజ్యోతి): జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సహయ ఉపకరణాలు అందించడంలో అలిన్‌కో సంస్థ ముందుకు రావడం అభినందనీ యమని కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలోబుధవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి హజరై మాట్లాడారు. గత రెండు నెలల క్రితం జన్కాపూర్‌ భవిత కేంద్రాన్ని సందర్శించినపుడు పిల్లల తల్లిదండ్రులు ఉపకరణాల అవసరాన్ని తన దృష్టికి తీసుకురావడంతో ఈ విషయమై అలిన్‌కో సంస్థ వారిని సంప్రదించడం జరిగిందన్నారు. సుమారు రూ. 22 లక్షలతో 184 మంది ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలను అందించేందుకు సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. దివ్యాంగ పిల్లలపై జాలి చూపించకుండా వారికి సమాజంలో మనతో సమానంగా జీవించే మనోధైర్యాన్ని కల్పించాలని తెలిపారు. దివ్యాంగులు ఎన్నో రంగాలలో రాణిస్తున్నారని పెర్కొన్నారు. అనంతరం ప్రత్యేక అవసరాల గల పిల్లలకు ఉపకరణాలు అందించారు. ఈ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, డీఈవో లలిత, తదితరులు పాల్గొన్నారు.

విద్యరంగ అభివృద్దిలో భాగస్వాములు కావాలి

:ప్రభుత్వం విద్యారంగ బలోపేతానికి అనేక చర్యలు చేపడుతుందని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు విద్యాభివృద్దిలో భాగస్వామలు కావాలని కలెక్టర్‌ హరిత అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో విద్యా వారోత్సవాలలో భాగంగా ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మౌళిక వసతుల కల్పన విద్యార్థుల సంఖ్య పెంపొందిండం ఆంశాలపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అదరించడం వలన విద్యార్థుల ప్రవేశాలు పెరిగి చదువు మధ్యలో మానివేసే పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావలన్నారు. ఉపాధ్యాయుల సమయపాలన నాణ్యమైన విద్యా బోధనపై పర్యవేక్షించలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మట్‌, డీఈవో లలిత, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ ఆహ్మద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఆలీబీన్‌ ఆహ్మద్‌, సర్పంచులు, కౌన్సిలర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2026 | 11:22 PM