ప్రజల సౌకర్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:18 PM
ప్రజలకు సౌకర్యాలు కల్పించమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. మంగళవారం రోడ్డు విస్తరణలో భాగంగా బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు.
-ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
మంచిర్యాలక్రైం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు సౌకర్యాలు కల్పించమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. మంగళవారం రోడ్డు విస్తరణలో భాగంగా బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. మంచిర్యాల నగరంలో నూతన రహదారులు నిర్మించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామ న్నారు. మంచిర్యాల నగరంలోని రాళ్లపేట మధ్య గల రాళ్లవాగుపై రూ. 23 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించామ న్నారు. నగరంలో సుమారు రూ. 225 కోట్లతో బ్రిడ్జి, నూతన రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చి ట్ల సత్యనారాయణ, నగర మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పా ర్టీ అద్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు పూదరి తిరుపతి, మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.