kumaram bheem asifabad- భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పునాది
ABN , Publish Date - Nov 26 , 2026 | 10:43 PM
భారత రాజ్యంగం మనదేశ ప్రజాస్వామ్యా నికి బలమైన పునాది అని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లోగురువారం భారత రాజ్యంగ దినోత్సవ వేడుకలకు ఎస్పీ నితికాపంత్‌తో కలిసి అఽధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యంగం ప్రపంచం లోనే చాలా గొప్పదన్నారు.
ఆసిఫాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యంగం మనదేశ ప్రజాస్వామ్యా నికి బలమైన పునాది అని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లోగురువారం భారత రాజ్యంగ దినోత్సవ వేడుకలకు ఎస్పీ నితికాపంత్‌తో కలిసి అఽధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యంగం ప్రపంచం లోనే చాలా గొప్పదన్నారు. భారత రాజ్యంగం పౌరులకు రక్షణ కవచం వంటిదని, సమానత్వం, స్వేచ్చ, న్యాయం, సౌభ్రాతృత్వంలకు ప్రతీక అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రతీ పౌరుడి గౌరవాన్ని, హక్కులను, అవకాశాలను పరిరక్షించే మార్గదర్శి రాజ్యంగమేనన్నారు. ప్రతీ ఒక్కరు భారత రాజ్యంగ పట్ల గౌరవం, విధేయత కలిగి ఉండి రాజ్యంగంలో పెర్కొన్న విదానాలను విలువలను గౌరవించి రాజ్యంగానికి లోబడి విదులు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, డీఆర్వో వేణు తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన,(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని బెల్లంపల్లి ఏరియా జీఎం శ్రీరమేశ్ అన్నారు. గోలేటి జీఎం కార్యాయల ఆవరణలో గురువారం భారత రాజ్యంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు రాజ్యంగ పీఠిక ప్రతిజ్ఙ చేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ జీఎం సేఫ్టి రఘకుమార్, ఏఐటీయూసీ నాయ కుడు అఫ్రిది, అధికారులు సంఘం కార్యదర్శి ఏరియా ఇంజనీర్ బి.వీరన్న, డీజీఎం పర్సనల్ డి.కిరణ్‌బాబు, సీనియర్ పర్సనల్ అధికారి మండల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మండలంలోని కోసిని గ్రామ పంచాయతీలో గురువారం రాజ్యంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యంగా నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వసాకే పుల్లబాయి, గ్రామ కార్యదర్శి జగదీష్, ఉప సర్పంచ్, సభ్యులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.
సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద భారత రాజ్యంగా దివస్ సందర్భంగా బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పలువురు నాయకులు పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజ్యంగంతోనే అంద రికీ సమ న్యాయం జరుగుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
లింగాపూర్, (ఆంధ్రజ్యోతి): ప్రతీ పౌరుడు రాజ్యాంగాని గౌరవించాలని లింగాపూర్ ఎస్సై సురేష్, లింగాపూర్ సర్పంచ్ జాదవ్ రాజశేఖర్ అన్నారు. మండల కేంద్రంలో అంబే ద్కర్ విగ్రం వద్ద నిర్వహించిన భారత రాజ్యంగ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచులు కిషన్, బబ్లు, మాజీ ఎంపీటీసీ రాథోడ్ బలిరామ్, మాజీ జడ్పీటీసీ అడే లక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ దినోత్సవాన్ని మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధవిహార్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సదర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎన్‌ఎస్‌ఎస్ పోగ్రాం అధికారి చంద్రయ్య అధ్యాపకులు సంతోష్, రాజమౌళి, శ్రీధర్, కిరణ్, తురుపతి, సురేందర్‌కుమార్, గోపాల్, విఠ్టల్, అర్చన, అంబెడ్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్, అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకులు దుర్గం శ్యాంరావు, గోపినాథ్, విలాస్, హంసరాజ్, విఠ్టల్, వివాజీ, శ్యాంరావు దుర్గె, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లోరాజ్యాంగ దినోత్సవాన్ని దళితులు ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమంలో జైనూర్ సర్పంచ్ కొడప ప్రకాష్, అంబేద్కర్ జయంత్యోత్సవ కమిటీ అధ్యక్షుడు కాంబ్లే అన్నారావ్, యూత అధ్యక్షుడుు సోనకాంబ్లే సిద్దు సభ్యులు సోనకాంబ్లే జనార్దన్, కాంబ్లే అమృత్, కాంబ్లే భావు సాహేబ్, కాంబ్లే నాగోరావ్, కాంబ్లే నాగోరావ్, గాయక్‌వాడ్ సతీష్, కాంగ్రేస్ పార్టీ ఎస్సీ సేల్ అధ్యక్షులు భుతాలె కిరణ్, గాయక్‌వాడ్ అంకుష్ తదితరులు పాల్గొన్నారు.