Share News

కాంగ్రెస్‌ పాలనకు చరమగీతం పాడాలి

ABN , Publish Date - Aug 30 , 2026 | 11:52 PM

రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ ప్రజాపాలన కు చరమగీతం పాడా లని కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధ న్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ పాలనకు చరమగీతం పాడాలి
కొల్లాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు

- కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి

పెద్దకొత్తపల్లి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ ప్రజాపాలన కు చరమగీతం పాడా లని కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధ న్‌రెడ్డి అన్నారు. ఆదివా రం మండల పరిధిలోని మారేడుమా నుదిన్నె వే డుకరావుపల్లి గ్రామా ల్లో కాంగ్రెస్‌ పార్టీ ఉప సర్పంచ్‌ గన్నోజు రామ్మో హన్‌, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు మంగమ్మలతో పాటు 50మంది కాంగ్రెస్‌ పార్టీని నాయకులు, కార్యకర్తలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరా రు. వారిని పార్టీ కండువా కప్పి సాధారంగా బీ ఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మా ట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా అధి కారంలోకి వచ్చిన తర్వాత వాటిని ముఖ్య మం త్రి రేవంత్‌రెడ్డి విస్మరించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కా ర్యక్రమంలో సాతాపూర్‌ సర్పంచ్‌ కట్ట వంశీగౌ డ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వెన్నెపల్లి గణేష్‌రావు, నాయకులు రవినాయక్‌, ఎస్‌.వెంక టయ్య, బెట్టరి నాగరాజు, రమేష్‌రెడ్డి, శ్రీకృష్ణ చారి, సీతారామనాయక్‌, బండి రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2026 | 11:52 PM