Share News

kumaram bheem asifabad- కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

ABN , Publish Date - Aug 08 , 2026 | 10:49 PM

జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అందరు కలిసికట్టుగా పనిచేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ సూచించారు.మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

kumaram bheem asifabad- కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

వాంకిడి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అందరు కలిసికట్టుగా పనిచేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ సూచించారు.మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని నాయకుల్లో, కార్యకర్తల్లో వర్గ పోరు లేకుండా ప్రఈఒక్కరు పార్టీ కోసం పనిచేయాలన్నారు. పదవులు శాశ్వతం కాదని పార్టీ కోసం పనిచేసి ప్రతి ఒక్కరికి గుర్తింపు వస్తుందని చెప్పారు. పదవులు రాలేదని ఎవరు నిరాశ పడవద్దన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలవద్దకు చేరవేసేలా నాయకులు కృషి చేయాలన్నారు. మండల అధ్యక్షునిగా ఎన్నికైనా గుర్నులే మెంగాజీతో పాటు కార్యవర్గ సభ్యులను ఈ సదర్భంగా శాలువలతో సన్మానించారు.

మండల అధ్యక్షుడిగా మెంగాజీ..

కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడిగా గుర్నులే మెంగాజీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా డికొండ మహేష్‌, ఉపాఽధ్యక్షులుగా సెల్వట్‌కార్‌ పెంటు, మారుతి, రమేశ్‌, ప్రధాన కార్యదర్శిగా సెండె హన్మంతు, సంయుక్త కార్యదర్శులుగా నాగ్‌సేన్‌, కోట్రరంగే మెంగాజీ, ఎన్నికయ్యారు. కార్యదర్శిగా లింగమూర్తి, ఉప్రె ధర్ము, సధాశివ్‌, కోశాధికారిగా కోట్రంగే విజయ్‌ తో పాటు 12 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు తెలిపారు.

Updated Date - Aug 08 , 2026 | 10:49 PM