Share News

కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తోంది

ABN , Publish Date - Jan 31 , 2026 | 11:31 PM

కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం ఎదురు గాలి వీస్తోందని అందుకు నిదర్శనం రాష్ట్రంలో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో కేవలం 56శాతం మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థులు సర్పంచ్‌గా గెలిచారని మం చిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు అన్నారు.

కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తోంది
లక్షెట్టిపేటలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు

మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు

లక్షెట్టిపేట, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం ఎదురు గాలి వీస్తోందని అందుకు నిదర్శనం రాష్ట్రంలో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో కేవలం 56శాతం మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థులు సర్పంచ్‌గా గెలిచారని మం చిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు అన్నారు. లక్షెట్టిపేటలో శని వారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షె ట్టిపేట మున్సిపాలిటీని ఐదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో చైర్మన్‌ వైస్‌ చైర్మన్‌ కౌన్సి లర్లు అంతా కలిసి ఐఖ్యతతో అన్ని విఽధాలుగా అభివృద్ధి చేసారన్నారు. ఇప్పు డు కూడా ప్రజలు అవకాశం ఇస్తారనే గట్టి నమ్మకం తమకుందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మున్సిపాలిటీకి వచ్చి న నిధులను మళ్లించి అభివృద్ధి జరుగకుండా అడ్డుకున్నారని, గత ప్రభుత్వంలో పట్టణ ప్రగతిలో సుమారు 26కోట్ల రూపాయలతో పట్టణాన్ని సుందరీకణంగా తీర్చి దిద్దామన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మరో 26కోట్లను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాటిని రద్దు చేసి అభివృద్దిని అడ్డుకు న్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం అని మండి పడ్డారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో ఒకటి రెండు మినహా అన్ని వార్డుల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులదే విజయం తథ్యమన్నారు. అనంతరం 9వార్డులకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండు రోజుల్లో మిగిలిన అభ్యర్థుల పేర్లను కూడా ప్ర కటిస్తామన్నారు. మోదెల గ్రామం నుంచి పలువురు బీఆర్‌ఎస్‌లో చేరడంతో కండువా కప్పి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నలుమాసు కాంతయ్య, మాజీ వైస్‌ చైర్మన్‌ పోడేటి శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు కౌన్సిలర్‌ అభ్యర్థులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 11:31 PM