రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jan 16 , 2026 | 11:46 PM
రైతు కళ్లుల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్య మని, రైతులను రాజును చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ తపన అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. సంక్రాంతి పండుగ రోజు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద శ్రీసత్యనారాయణస్వామి ఎత్తిపోతలపథకం ద్వారా యాసంగి పంట కో సం గూడెం ఎత్తిపోతల నీటిని గురువారం జిల్లా కలెక్టర్ దీపక్‌కుమా ర్ తో కలిసి ప్రత్యేక పూజ నడుమ సాగునీటిని విడుదల చేశారు.
ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
దండేపల్లి జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రైతు కళ్లుల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్య మని, రైతులను రాజును చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ తపన అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. సంక్రాంతి పండుగ రోజు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద శ్రీసత్యనారాయణస్వామి ఎత్తిపోతలపథకం ద్వారా యాసంగి పంట కో సం గూడెం ఎత్తిపోతల నీటిని గురువారం జిల్లా కలెక్టర్ దీపక్‌కుమా ర్ తో కలిసి ప్రత్యేక పూజ నడుమ సాగునీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండేళ్ల క్రితం గోదావరికి వరద నీరు ఉధృతంగా రావ డంతో లిప్ట్ పంపులు నీటిలో మునిగిపోయింది. దానిని దృష్టిలో పెట్టుకో ని మళ్లీ నీటిలో మునగకుండా ఎత్తు ప్రదేశంలో బిల్డింగ్ ఏర్పిటు చేసి అందులో పంపులు షిప్ట్ చేయడంతోనే సాగునీటిని ఆలస్యంగా విడుదల చేయడం జరిగిందన్నారు. కలెక్టర్ దీపక్‌కుమార్ మాట్లాడుతూ గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా యాసంగి పంటల సాగు కోసం మండలం తానిమడుగు డి30నుంచి హాజీపూర్ మండలం డి42 డిస్ట్రిబ్యూటర్ వర కు సుమారు 19213 వేల ఎకరాల పంటలకు నీటిని అందిస్తున్నా మన్నారు. వారబంది పద్దతిలో నీళ్లు అందిస్తున్నందున ,రైతులు పరస్ప రం సహకరించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, లక్షెట్టిపేట వ్యవపాయ మార్కెట్ కమిటీ ఛై ర్మన్ దాసరి ప్రేమ్‌చందు, సర్పంచు నందిని అశోక్. ఆర్జీపీఆఆర్‌ఎస్ జి ల్లా అధ్యక్షుడు త్రిమూర్తి, మాజీ ఎంపీపీలు శ్రీనివాస్, గురువయ్య, కాం తారావు, నీటి పారుదల శాఖ ఈఈ ప్రవీణ్, డీఈలు దశరథం, వెంక టేశ్వర్లు పాల్గొన్నారు.