Share News

kumaram bheem asifabad- కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు అమలు చేయాలి

ABN , Publish Date - Sep 04 , 2026 | 10:53 PM

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై వంటలు చేసి అక్కడే భోజనాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడు తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు.

kumaram bheem asifabad- కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు అమలు చేయాలి
ఆసిఫాబాద్‌లో వంటా వార్పు కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ నాయకులు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై వంటలు చేసి అక్కడే భోజనాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడు తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలోనే అభివృద్ధి జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లు ఆకాష్‌, అహ్మద్‌, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, నాయకులు కోవసాయినాథ్‌, చిలువేరు వెంకన్న, సరస్వతి, పోశన్న, లక్ష్మి, రవీందర్‌, నిసార్‌, జీవన్‌, ఆశోక్‌ పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ అజయ్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్‌ నాయకులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ బాబిరే పెంటు, వాంకిడి సర్పంచు సతీష్‌, మాజీ సర్పంచు బండె తుకారం, బీఆర్‌ఎస్‌ నాయకులు ఉయికే రాము, రాకేష్‌, రాజన్న, తిరుపతి, శంకర్‌, మహిళలు పాల్గొన్నారు.

తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని బీఆర్‌ఎస్‌ నాయకుడు జగదీష్‌ అన్నారు. కుమురం భీం చౌరస్తాలో శుక్రవారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి):కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు,మాజీ ఎంపీపీ తోడసం భాగ్యలక్ష్మి, మండల అధ్యక్షుడు తోడసం ధర్మారావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పారీ ్టరాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండల కేంద్రంలో శుక్రవారం మండల శాఖ ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆత్రం ఓంప్రకాష్‌, సహకార సంఘం చైర్మన్‌ కేంద్రే శివాజీ, మాజీ సర్పంచులు ఆర్క నాగోరావు, కోవ నాందేవ్‌, పెందోర్‌ అర్జున్‌, నాయకులు గెడం యశ్వంత్‌రావు, మడావి దుర్‌నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని మాజీ ఎంపీపీ కలాం అన్నారు. కెరమెరిలో శుక్రవారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పాలన పూర్తిగా విఫలమైందన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు తెలిపారు. ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో ఇంత వరకు నెరవేర్చలేదని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దృపతాబాయి, మాజీ ఎంపీపీ మోతీరాం, అంబాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2026 | 10:53 PM