Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:38 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్ర భుత్వం అన్ని రంగాల్లో విఫల మైందని రైతులకు, సింగరేణి కార్మికులకు ఇ చ్చిన హామీలను విస్మరించి సీఎం రేవంత్‌రెడ్డి అన్యాయం చేశా రని మం చిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు

-రైతులకు, సింగరేణి కార్మికులకు మొండి చేయి

-మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్ర భుత్వం అన్ని రంగాల్లో విఫల మైందని రైతులకు, సింగరేణి కార్మికులకు ఇ చ్చిన హామీలను విస్మరించి సీఎం రేవంత్‌రెడ్డి అన్యాయం చేశా రని మం చిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కాలనీలో గల ఆయన నివాసంలో విలేకరుల సమావే శంలో మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని, రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిచేయకుండా ఇబ్బం దులకు గురి చేస్తుందన్నారు. రైతులు ధాన్యాన్ని పండిస్తే కొనుగోలు చేయ డంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రస్తుతం ఏ పంట వేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రైతు బంధు ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పంట వేసుకో వడానికి ముందే అందించామని, రైతు భీమాను 15 రోజుల్లోగా అందించామన్నారు. ప్రస్తుతం ఈ రెండు ప థకాల అమలులో తీవ్ర జాప్యం చేస్తూ రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుం దన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకుడు విజిత్‌రావు మాట్లాడుతూ రైతు లకు భరోసా కల్పించే నాయకుడే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో లేరన్నారు. కేసీఆర్‌ పాలనలో రైతులకు అన్ని విధాల మేలు జరిగిందన్నారు. ఈ సమావేశంలో నస్పూ ర్‌, మంచిర్యాల పట్టణాధ్యక్షుడు అక్కూరి సుబ్బన్న, సత్యం, నాయకులు లక్ష్మణ్‌, ఎర్రయ్య, కుమార్‌, సుధీర్‌, తిరుప తి, జావేద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 11:38 PM