Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను దగా చేసింది

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:40 PM

కాంగ్రెస్‌ ప్రభు త్వం రైతులను దగా చేసిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివా కర్‌రావు పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను దగా చేసింది
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు

మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభు త్వం రైతులను దగా చేసిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివా కర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివా సంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు హామీలు ఇచ్చి విస్మరించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్నాన్ని రైతులు, ప్రజలు పాతాళంలోకి తొక్కేస్తారన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుతో రైసుమిల్లర్లు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. 1.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగో లులో రూ. 23 కోట్లు దోచుకున్నారన్నారు. రైతులు ఎంతో శ్రమించి పండించిన ధాన్యాన్ని సైతం అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఒక దశలో ప్రభుత్వం ధాన్యం కొంటుం దో లేదోనని ఆందోళనకు గురయ్యారన్నారు. బస్తాకు 3 కిలోల కోత విధించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రాను న్న రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వంద మీటర్ల గోతిలో పూ డ్చివేయడం ఖాయమన్నారు. కొందరు రైతులకు ఇంకా ధా న్యం అమ్మిన డబ్బులు జమ కాలేదని, కలెక్టర్‌ స్పందించి డ బ్బులు వచ్చేలా చూడాలన్నారు. లక్షెట్టిపేటలో గోడ కూలి మృతిచెందిన నలుగురు రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఇంత వరకు ఆదుకోకపోవడం దారుణమని, వెంటనే కు టుంబానికి రూ. 30 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఈ నెల 8న బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దం డేపల్లి, లక్షెట్టిపేటలో పర్యటించి రైతులను పరామర్శిస్తారని, వారి సమస్యలను తెలుసుకుంటారని తెలిపారు. రాష్ట్ర నాయ కుడు విజిత్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో రూ. 4 కోట్ల మహా ప్రస్థానానికి రూ. 10.20 కోట్లు ఖర్చు చేసి స్థానిక ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారన్నారు. సొసైటి పేరుతో 24 ఎకరాల భూదాన్‌ భూమిని కబ్జా చేశారన్నారు. మహా ప్రస్థా నం పేరిట అవినీతి అక్రమాలకు ఎమ్మెల్యే తెరలేపారన్నారు. స్మశాన వాటిక కార్పోరేషన్‌కు అనుసంధానంగా ఉండాలి కానీ ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు పాలన దాచుకో దోచుకో అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని దించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. వచ్చే బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజల ఆ కాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామన్నారు. ఈ సమా వేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు అక్కూరి సుబ్బన్న, సత్యం, రవీందర్‌రెడ్డి, అబ్దుల్‌సత్తార్‌, సుధీర్‌, సాగర్‌ , రవి, శ్రీకాంత్‌, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 11:40 PM