Share News

kumaram bheem asifabad- అటవీశాఖ అధికారుల తీరు సరికాదు

ABN , Publish Date - Oct 15 , 2026 | 10:26 PM

జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండలా ల్లోని ఆదివాసీ గూడాల్లో ఏళ్లుగా నివసిస్తున్న ఆదివాసీ ప్రజలపై అధికారుల తీరు సరికాదని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్‌ అన్నారు. అటవీ శాఖ అధికారులు లేని పోని అంక్షలు విధిస్తు అభివృధ్ధికి అడ్డు పడుతున్నారని ఏజెన్సీ ఆదివాసీ గ్రామాల్లో అటవీ శాఖ అధికారుల పెత్తనం అధికం కాకూడదనే నిర్ణయంతో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం సమీపంలోని ప్రధాన రోడ్డుపై గురువారం రెండు గంటల పాటు వందలాది మందితో రాస్తారోకో నిర్వహించారు.

kumaram bheem asifabad- అటవీశాఖ అధికారుల తీరు సరికాదు
సిర్పూర్‌(యు)లో ధర్నా చేస్తున్న ఆదివాసీలు

సిర్పూర్‌(యు), అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండలా ల్లోని ఆదివాసీ గూడాల్లో ఏళ్లుగా నివసిస్తున్న ఆదివాసీ ప్రజలపై అధికారుల తీరు సరికాదని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్‌ అన్నారు. అటవీ శాఖ అధికారులు లేని పోని అంక్షలు విధిస్తు అభివృధ్ధికి అడ్డు పడుతున్నారని ఏజెన్సీ ఆదివాసీ గ్రామాల్లో అటవీ శాఖ అధికారుల పెత్తనం అధికం కాకూడదనే నిర్ణయంతో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం సమీపంలోని ప్రధాన రోడ్డుపై గురువారం రెండు గంటల పాటు వందలాది మందితో రాస్తారోకో నిర్వహించారు. అంతకు ముందు మండల కేంద్రంలో కుమరం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు ఆర్సించారు. అనంతరం ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా కోట్నాక విజయ్‌ మాట్లాడుతు జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండలాల్లోని ఆదివాసీ గూడాల్లో ఎన్నో సంవత్సరాలు నివసిస్తున్న ఆదివాసీ ప్రజల పట్ల అటవీ శాఖ అధికారులు లేని పోని అంక్షలు విధిస్తు అభివృధ్ధికి అడ్డు పడుతున్నారని ఆరోపించారు. అడవిని నమ్యుకోవడంతో పాటు అడవిని రక్షిస్తు నివసిస్తున్న ఆదివాసీ ప్రజలను లేని పోని అంక్షలతో ఇబ్బందులకు గురి చేస్తే తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. పసా చట్టం రాజ్యాంగం కల్పించిన ఏజేన్సి చట్టాలు ఇలాంి అనేక చట్టాలను కల్పించిందన్నారు. అయినప్పటికి వాటికి విరుద్దంగా అటవీ శాఖ వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఆదేవిధంగా ఆదివాసీ గూడాల్లో అటవీ శాఖ అధికారులు అంక్షలు విధించడం సరి కాదన్నారు. కొన్ని గ్రామాలలో ఆదివాసీ ఇండ్లలోకి ఆక్రమంగా చొరబడి వారిని భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. తాత ముత్తాతల కాలం నుండి సాగు చేస్తున్న భుములు ఇప్పుడు అటవీ శాఖ పరిధిలోకి ఎలా ఉంటాయని ప్రశ్నించారు. అడవి తల్లి భుములను నమ్మకోని నివాసం ఉంటున్న ఆదివాసీ ప్రజల పట్ల ఇలాంటి అంక్షలువిధిస్తు ఇబ్బందులకు గురి చేస్తే కుంరంభీం , బిర్సాముండా వలె మరో పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అవసరమైతే అటవీ శాఖ కార్యాలయాలతో పాటు సీఎం ఇంటిని కూడా మట్టడిస్తామన్నారు. అటవీ శాఖ ఆధివాసీ గూడాలలో తిరగ నివ్వబోమని హెచ్చరించారు. జైనూర్‌ సీఐ రమేశ్‌ ఆద్వర్యంలో జోడేఘాట్‌ రేంజ్‌ అధికారి రమేష్‌ ధర్నా వద్దకు వచ్చారు. నాయకులు అడ ఇగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆదివాసీ ప్రజలను తాము కావాలని ఇబ్బందులకు గురి చేయడం లేదని సమాధానం ఇచ్చారు. అంతే కాకుండా వారి ఆధీనంలో ఉన్న పట్టా భూముల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అటవీ శాఖ పరిధిలో ఉండే భుములలో తవ్వకాలు చేయడం, రోడ్లు వేయడం చెట్టు నరకడం లాంటిది చేసినప్పుడే సమస్య తలెత్తుందన్నారు. తమకు ఇలాంటి నిర్మాణాలు పనులు చేపట్టాలనుకుంటు అనుమతి తీసుకోని నిర్మించుకోవాలని సమాధానం ఇచ్చారు. ఆనంతరం ఆదివాసీ నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆత్రం భగ్వంత్‌రావ్‌, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్‌, గౌరవ అధ్యక్షుడు కనక ప్రభాకర్‌, ఆదివాసీ జిల్లా విద్యార్థిల సంఘం అధ్యక్షులు మడావి మధుకర్‌, సిర్పూర్‌(యు) మండల అధ్యక్షుడుకుంర భీంరావ్‌, నాయకులు పెందుర్‌ ప్రకాష్‌, మూడు మండలాల ప్రజలు పాల్గోన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 10:26 PM