మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం లక్ష్యం
ABN , Publish Date - Aug 11 , 2026 | 12:47 AM
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా మార్చడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం కోనరావుపేట
కోనరావుపేట, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా మార్చడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం కోనరావుపేట మండలం గొల్లప ల్లి గ్రామంలో మహిళా సమైక్య భవనాన్ని సోమవారం ప్రారంభించారు. నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టు, మూలవాగులో వరద తాకిడికి కొట్టుకుపోయిన కాజ్‌వే లను పరిశీలించారు. అనంతరం నిమ్మపల్లి ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. గత పదేళ్లలో బీఆర్ ఎస్ ప్రభు త్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని విమ ర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంఘాల కోసం సుమారు రూ. 60 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. ఇప్పటికే మూడు విడతల్లో వడ్డీ, రీయింబర్స్‌మెంట్ చెల్లించామ ని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 42 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించా మని చెప్పారు. సిరిసిల్లలో తయారైన చేనేత చీరలను రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు పంపిణీ చేస్తు న్నామని తెలిపారు. రాష్ట్రంలో 8 వేల మహిళా సంఘాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, వేములవాడ నియోజకవర్గంలో పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో తెలంగాణ తరహా పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని రూ. 250 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధా న్యత ఇస్తోందన్నారు. కోనరావుపేట మండలంలో త్వరలో వంతెనల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పెంటి వాగు, మూల వాగుపై బ్రిడ్జిల నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూ రయ్యాయని, త్వరలో పనులు చేపడతామని తెలిపారు. త్వరలో గొల్లపల్లికి వాటర్ ప్లాంట్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా మెరుగు పరిచేందుకు 3,600 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పోడు భూముల సమ స్యల పరిష్కారం, కళ్యాణ మండపం నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సం దర్భంగా కాంగ్రెస్ నాయకులు ఏఎంసి చైర్మన్ కచ్చకా యల ఎల్లయ్య, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, జిల్లా నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఫిరోజ్ పాషా, మండల అధ్యక్షుడు మానక సత్యం పాల్గొన్నారు.