Share News

సీఎంఆర్‌ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి

ABN , Publish Date - May 18 , 2026 | 11:15 PM

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం రైసుమిల్లులకు తరలిస్తున్నామని, ఈ క్రమంలో రైసుమిల్లర్లు ధాన్యం సీఎంఆర్‌ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు.

సీఎంఆర్‌ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 18 (ఆంధ్రజ్యోతి) : రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం రైసుమిల్లులకు తరలిస్తున్నామని, ఈ క్రమంలో రైసుమిల్లర్లు ధాన్యం సీఎంఆర్‌ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. సోమవారం కలెక్టర్‌ సమావేశ మంది రంలో రైసుమిల్లర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గత ఖరీఫ్‌ లక్ష్యాలు పూర్తి చేసిన రైసుమిల్లర్లు ఈ సారి కేటాయించిన ధాన్యం లక్ష్యాల సాధన ప్రారంభించాలన్నారు. లారీల ద్వారా తరలించిన ధాన్యాన్ని త్వరగా దిగుమి చేసుకోవాలన్నారు. రవాణా శాఖ ఆద్వర్యంలో లారీలను సమకూరుస్తున్నామన్నారు. నిర్ధేశిత సమయంలో కేటాయిం చిన లక్ష్యాలను పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో కృషి చేయా లన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాములు, జిల్లా పౌరసర ఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్‌ శ్రీకళ, డీఆర్‌డీవో కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2026 | 11:15 PM