Share News

kumaram bheem asifabad-ముఖ్యమంత్రి నిర్ణయం హర్షణీయం

ABN , Publish Date - Jun 02 , 2026 | 10:57 PM

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుమరం భీం జిల్లాకు రూ.112 కోట్ల నిధులు అభివృద్ధి పనులు, శంకుస్థాపనులు చేయడం అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నట్టు చెప్పారు.

kumaram bheem asifabad-ముఖ్యమంత్రి నిర్ణయం హర్షణీయం
మాట్లాడుతున్న ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌

కాగజ్‌నగర్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుమరం భీం జిల్లాకు రూ.112 కోట్ల నిధులు అభివృద్ధి పనులు, శంకుస్థాపనులు చేయడం అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నట్టు చెప్పారు. బీఆర్‌ఎస్‌ హాయాంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పూర్తిగా వెనుకబడిందన్నారు. ముఖ్యంగా సాగునీటి రంగాన్ని పూర్తిగా విస్మరించినట్టు గుర్తు చేశారు. సదర్మాట్‌, చనాకా-కోర్టా, కడెం ప్రాజెక్టు మరమ్మతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్టు వివరించారు. అడ, వట్టివాగు, పీపీరావు, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టులకు కూడా త్వరలోనే నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో డబుల్‌ బెడ్‌ రూంలు సిద్దిపేట, సిరిసిల్లా, గజ్వెల్‌ నియోకజవర్గాలకే అభివృద్ధి చేసుకున్నట్టు గుర్తు చేశారు. సీఎం సభా సక్సెస్‌ చేసినందుకు అందరికి ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ షాహిన్‌ సుల్తానా, కౌన్సిలర్లు వసీమున్నీసా, కావేటి విజయ్‌కుమార్‌, దుర్గం సూరజ్‌, ఎమ్మాజీ శారత, జ్యోతి, పట్టణ అధ్యక్షులు అల్లాడి రాజు, నాయకులు దస్తగిర్‌, లెండుగురే శ్యాంరావు, సిద్దం శ్రీనివాస్‌, ఎమ్మాజీ సంతోష్‌, యూసుఫ్‌, జక్కు సురేష్‌, జగ్గాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 10:57 PM