Share News

kumaram bheem asifabad- ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలి

ABN , Publish Date - May 30 , 2026 | 11:52 PM

ప్రభుత్వం ఏర్పాటు అనంతరం మొట్ట మొదటి సారిగా జిల్లాకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. డీసీసీ కార్యాలయంలోని నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

kumaram bheem asifabad- ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏర్పాటు అనంతరం మొట్ట మొదటి సారిగా జిల్లాకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. డీసీసీ కార్యాలయంలోని నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వెనకబడిన కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాను అభివృద్ధి చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి జిల్లాకు రానున్నట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపార. పీవీటీజీల అభివృద్ధికి ప్రభ్తువం కట్టుబడి ఉందని తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు కోసం కృషి చేయడానికి సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. కెరమెరి మండలం కోటారి గ్రామంలో 28 ఇందిరమ్మ ఇండ్లను సీఎం ప్రారంభించడంతో పాటు కోలాం గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు కాగజ్‌నగర్‌ ఎక్స్‌ రోడ్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు తారీక్‌, భీంరావు, మల్లేష్‌, శంకర్‌, దీపక్‌, జక్కయ్య, వాసుదేవ్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2026 | 11:52 PM