kumaram bheem asifabad- ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలి
ABN , Publish Date - May 28 , 2026 | 10:57 PM
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జూన్ 1న పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహింగసభను విజయ వంతం చేయాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రరావ్ కోరారు. స్థానిక మార్కెట్ యారుడ ఆవరణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రధాన ంగా దృష్టి సారించారన్నారు. ఇందులో భాగంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పాటు చేయూత పథకం కింద కొత్త పింఛన్లు మంజురు చేస్తారని ఆయన వివరించారు.
జైనూర్, మే 28 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జూన్ 1న పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహింగసభను విజయ వంతం చేయాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రరావ్ కోరారు. స్థానిక మార్కెట్ యారుడ ఆవరణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రధాన ంగా దృష్టి సారించారన్నారు. ఇందులో భాగంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పాటు చేయూత పథకం కింద కొత్త పింఛన్లు మంజురు చేస్తారని ఆయన వివరించారు. పోడు భుములు సస్యశ్యామలం చేయాలనే భావనంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కలలను నిజం చేసేందుకు బహింరగ సభలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ నిర్మాణంపై రేవంత్‌రెడ్డి ప్రకటన చేస్తారన్నారు. జిల్లా నలుమూలల నుంచి లక్షలాదిగా అభిమానులు ప్రజలు తరలి వచ్చి ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ముకీద్, కార్యవర్గ సభ్యులు పెందుర్ ప్రకాష్, సర్పంచ్‌లు తొడ్సం రాజేందర్, ఆత్రం మీరాబాయి, మేస్రాం స్పందన, మడావి మనోహర్, ఆత్రం జాలీషావ్, మాజీ వైస్ ఎంపీపీలు చిర్లే లక్ష్మణ్, షేక్ రషీద్, మార్కెట్ డైరెక ్ఠర్ లింగు, మాజీ కోఅప్షన్ సభ్యులు అఫ్రోజ్ ఖాన్, నాయకులు మేస్రాం అంబాజీరావ్, అజ్జు లాలా, హైమద్, హైదర్, రహీం, షేక్ అబ్బు, సెడ్మకీ నాగోరావ్ తదితరులు ఉన్నారు.