Share News

కార్మిక వ్యతిరేక కోడ్‌లను కేంద్రం రద్దు చేయాలి

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:49 AM

కార్మిక వ్యతిరేక కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, సీఐటీయూ

 కార్మిక వ్యతిరేక కోడ్‌లను కేంద్రం రద్దు చేయాలి

సిరిసిల్ల అర్బన్‌, ఆగస్టు 10 (ఆంఽధ్రజ్యోతి): కార్మిక వ్యతిరేక కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగుమంటి ఎల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ ఉపాధి కూలీల, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ దేశవ్యాప్త పిలుపు మేరకు సిరిసిల్లలో సీఐటీయూ, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల అధ్వర్యంలో సోమవారం జైల్‌ భరో కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని జూనియర్‌ కళాశాల మైదానం నుంచి అన్ని వర్గాల కార్మికులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబే ద్కర్‌ చౌరస్తాలో ప్రధాన రోడ్డుపై బైఠాయించి మహాధర్నా చేపట్టారు. ఽధర్నాలో పాల్గొన్న నాయకులు, కార్మికులను పోలీసులు బలవంతంగా పక్కకు తప్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 20 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్ధానంలో నాలుగు లేబర్‌కోడ్‌లను తీసుకొచ్చి కార్మికులను కట్టుబానిసలుగా మారస్తుందని మండిప డ్డారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించకుండా రైతులకు అన్యాయం చేస్తుందని గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్‌, నాయకులు అన్నల్‌ధాస్‌ గణేష్‌, సూరం పద్మ, ఎలిగేటి రాజశేఖర్‌, గీసబిక్షపతి, దాసరి రూప, అడెపు రజిత, బూర శ్రీనివాస్‌, మ్యాలల నర్సయ్య, శ్రీరాం సదానందం, సిరిమల్ల సత్యం, గోవిందు లక్ష్మణ్‌, కోల శ్రీనివాస్‌, బెజుగం సురేష్‌, స్వర్గం శేఖర్‌, సావనపల్లి రాములు, గిరిబాబు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2026 | 12:49 AM