Share News

kumaram bheem asifabad-ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న కేంద్రం

ABN , Publish Date - Oct 08 , 2026 | 10:32 PM

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, రాజ్యంగ హక్కులను కాలరాస్తోందని డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటుహక్కు రక్షణ కోసం గురువారం జిల్లా కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌ పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు

kumaram bheem asifabad-ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న కేంద్రం
నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, రాజ్యంగ హక్కులను కాలరాస్తోందని డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటుహక్కు రక్షణ కోసం గురువారం జిల్లా కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌ పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డీడీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు వెళ్లిన రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకోవడం సరికాదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కుపై ఆందోళన కలిగించే పరిణామని అన్నారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అందించిన రాజ్యంగం ప్రఈ పౌరుడికి కల్పించిన హక్కులను కాపాడడం అందరి బాధ్యత అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు రక్షణ హక్కు కోసం కాంగ్రెస్‌ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగ, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అబ్దుల్లా, డీసీసీ ఉపాఽధ్యక్షులు తారీక్‌, మండల, పట్టణ అధ్యక్షులు మురళీ, ఇమ్రాన్‌, మంగాజీ, సుజాహిత్‌ఖాన్‌, నాయకులు జక్కయ్య, చిట్ల నారయణ, సత్తయ్య, కళావతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 10:32 PM