kumaram bheem asifabad- కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలి
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:18 PM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేటీకరణ, కార్మికుల వ్యతిరేక విధానాలను వ్యతిరేకించానలి సీఐటీయూ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు జిల్లా ఇన్‌చార్జీ భూపాల్ అన్నారు. సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల దేశశ్యాప్తపిలుపులో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జైల్‌భరోకు పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు హాజరయ్యారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేటీకరణ, కార్మికుల వ్యతిరేక విధానాలను వ్యతిరేకించానలి సీఐటీయూ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు జిల్లా ఇన్‌చార్జీ భూపాల్ అన్నారు. సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల దేశశ్యాప్తపిలుపులో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జైల్‌భరోకు పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌చౌక్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. దీన్ని పోలీసులు భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మికులు, రైతులు, వ్యవసాయకూలీలు, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా విధానాలను అమలు చేస్తుందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని, కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటుధర కల్పించడానికి ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాలన్నారు. రైతులకు రుణమాఫీచట్టం తీసుకురావాలన్నారు. విద్యుత్‌రంగాన్ని ప్రైవేటికరించే విధానాలను ఉపసంహరించుకోవాలని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను కొనసాగించాలన్నారు. కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విదానలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు,ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లాకార్యదర్శి రాజేందర్,ఉపాధ్యక్షులు బాలకిషన్, శ్రీకాంత్, సంయుక్తకార్యదర్శి కృష్ణమాచారి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దినకర్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్, ఐఎఫ్‌టీయూ నాయకులు చాంద్‌పాషా, ఐద్వా జిల్లా సంయుక్త కార్యదర్శి పద్మ, సీఐటీయూ నాయకులు రాజు, శంకర్, రాజేశ్వరి, స్వరూప,గంగామణి, జయ, ప్రభాకర్, చంద్రకళ, భీంభాయి,సంతోష్, బుద్దు, సమ్మయ్య, నవీన, వనిత, తదితరులు పాల్గొన్నారు.