Share News

‘నీట్‌ లీకేజీ’పై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి

ABN , Publish Date - May 13 , 2026 | 11:09 PM

నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీపై కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్య దర్శి తారాసింగ్‌ డిమాండ్‌ చేశారు.

‘నీట్‌ లీకేజీ’పై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి
నాగర్‌కర్నూల్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు

- ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మే 13 (ఆంధ్రజ్యోతి) : నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీపై కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్య దర్శి తారాసింగ్‌ డిమాండ్‌ చేశారు. బుఽధవారం ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అం బేడ్కర్‌ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ యన మాట్లాడుతూ ఎంతో కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించా రు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే మరోమా రు నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ అయ్యిందన్నారు. 2024 సంవత్సరంలో నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ గుణపాఠంతో అయినా కేంద్ర ప్రభుత్వ తగిన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. నీట్‌ నిర్వహణ ఏజెన్సీ ఎన్‌టీఏను తక్షణమే రద్దు చేసి, లీకేజీపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను కఠినం గా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మధు, నాయకులు మల్లికార్జున్‌, కుర్మయ్య, రామకృష్ణ, వెంకటేష్‌, శివరాం, వంశీ పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2026 | 11:09 PM