Share News

kumaram bheem asifabad- విద్యార్థులను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

ABN , Publish Date - Jul 23 , 2026 | 10:35 PM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో గురువారం అంబేద్కర్‌ విగ్రహానికి ఫూలమాలలు వేసిన అనంతరం జాతీయ రహదారిపై కాంగ్రెస్‌ శ్రేణులు రాస్తారోకో చేశాయి.

kumaram bheem asifabad-  విద్యార్థులను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
వాంకిడిలో రాస్తారోకో చే స్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

వాంకిడి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో గురువారం అంబేద్కర్‌ విగ్రహానికి ఫూలమాలలు వేసిన అనంతరం జాతీయ రహదారిపై కాంగ్రెస్‌ శ్రేణులు రాస్తారోకో చేశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానిమోదీ ప్రభుత్వం యువతీయువకులను తీవ్రంగా మోసం చేస్తుందని చెప్పారు. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి బాద్యత వహిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా వెళ్లిన రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీని అరెస్ట్‌ చేయడం అక్రమమని ఆయన ఆరోపించారు. విద్యార్థులను విచక్షణారహితంగా పోలీసులు దాడి చేసి గాయపర్చడం విచారకరమన్నారు. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంతి ధర్మెంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్‌ మంగ, బంబార సర్పంచ్‌ కృష్ణా, కాంగ్రెస్‌ మండల నాయకులు గుర్నులే నారాయణ, మెంగాజీ, ఉషా, శివాజీ, నాగభూషనమ్‌, రమేష్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

సిర్పూరు(టి), జూలై 23 (ఆంధ్రజ్యోతి): నీట్‌పేపర్‌ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలని గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్‌ రియాజ్‌ అలీ, ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ డిమాండ్‌ చేశారు. గురువారం సిర్పూరు(టి) మండల కేంద్రంలోని నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ కార్యదర్శి అబ్దుల్‌ షకీల్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్‌ సిడాం గణపతి, సిర్పూరు(టి) మాజీ ఎంపీటీసీ సోహెల్‌ అహ్మద్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అబ్దుల్‌ అఖిల్‌, మాజీ జడ్పీటీసీ సభ్యుడు దోని రవీందర్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తులసీరాం, రాజు, సలీం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఽసందర్భంగా సీఐ సంతోష్‌ కుమార్‌ ధర్నాను విరమింపజేసి వాహనాల రాకపోకలు సాగేలా చర్యలు తీసుకున్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కేసరి కిషన్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యాం నాయక్‌ మాట్లాడుతూ నీట్‌ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చేయడం దారుణమని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటి చైర్మన్‌ ఇరుకుల మంగ, ఆర్టిఏ నెంబరు రమేష్‌, నాయకులు రవీందర్‌, వెంకటేశ్వర చారి, సర్పంచులు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నీట్‌ పరీక్ష లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు డుబ్బుల నానాయ్య, నాయకులు వెంకన్న, జాడి దిలీప్‌, సత్తన్న, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని గాంధీ చౌక్‌ ప్రధాన రహదారిపై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు మెస్రం భూపతి, ఆత్రం శంకర్‌,ఆత్రం దౌలత్‌రావు, ఆత్రం గోవింద్‌రావు, ఆత్రం వీణాబాయి,ఆత్రం పప్రకాష్‌,సేడ్మకి జానేరావు,ఆత్ర పార్వతి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): నీట్‌ ప్రశ్న పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌ డిమాండ్‌ చేశారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆదేశాల మేరకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్‌ అబ్దుల్‌ ముకీద్‌ అధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు ప్రధాన రోడ్డుపై ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు ఉయిక చందు, రాథోడ్‌ రాందాస్‌, జిల్లా ఎగ్జీక్యూటీవ్‌ మెంబర్‌ పెందుర్‌ ప్రకాష్‌, మాజీ వైస్‌ ఎంపీపీలు షేక్‌ రషీద్‌, చిర్లే లక్ష్మణ్‌, జిల్లా నాయకులు మేస్రాం అంబాజీ, డాక్టర్‌ షేక్‌ జమీల్‌, వసీం, అజ్జులాల, హైదర్‌, హైమద్‌ ఖాన్‌, ఫెరోజ్‌ ఖాన్‌, కనక గంగారాం తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): నీట్‌ పరీక్ష లీకేజీ కారణంగా 27మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాష్ట్ర గ్రంథాలయ చైర్మెన్‌ రియాజ్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాస్తారోకో, ర్యాలీ నిర్వహించి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ సిడాం గణపతి, జిల్లా ఉపాధ్య క్షుడు జగ్గాగౌడ్‌, జిల్లా కార్యదర్శి నాహీర్‌అలీ, బ్లాక్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్దన్‌, సర్పంచులు చిన్నయ్య, రాంప్రసాద్‌, చిరంజీవి, కొడప శంకర్‌, ఉపసర్పంచ్‌ ఆదర్శ్‌, నాయకులు విశ్వేశ్వర్‌, రాజన్న, రామకృష్ణ, బాబురావు, పెంటయ్య పాల్గొన్నారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రియాజ్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.

పెంచికల్‌పేట, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నాయ కులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 23 , 2026 | 10:35 PM