గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం కృషి
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:11 PM
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్న దని బీజేపీ నాయకుడు, జిల్లా క బడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి అన్నారు.
- కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి
ఊర్కొండ,మార్చి12 (ఆంధ్రజ్యో తి) : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్న దని బీజేపీ నాయకుడు, జిల్లా క బడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి అన్నారు. గు రువారం మండలంలోని మాదారం గ్రామ పంచాయతీ పరిధిలోని చెన్నాయపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా మార్చేందుకు పెద్దపీట వేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్, నాయకులు ఆంజనే యులు, లక్ష్మారెడ్డి, వెంకటేష్, పరశురాములు, మల్లేష్, రవీందర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు.