జన గణన పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Oct 22 , 2026 | 11:47 PM
జిల్లాలో జనాభా గణన రెం డవ దశను పకడ్బందీగా, సమర్థవం తంగా నిర్వహించేందుకు అధికారులు సిబ్బంది నిర్దేశిత విధి విధానాలను ఖ చ్చితంగా పాటించాలని కలెక్టర్ హే మంత కేశవ్ పాటిల్ సూచించారు.
- కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్, అక్టోబరు22 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో జనాభా గణన రెం డవ దశను పకడ్బందీగా, సమర్థవం తంగా నిర్వహించేందుకు అధికారులు సిబ్బంది నిర్దేశిత విధి విధానాలను ఖ చ్చితంగా పాటించాలని కలెక్టర్ హే మంత కేశవ్ పాటిల్ సూచించారు. జ నాభా గణన రెండవ దశ అధికారులకు జిల్లా అధికారులు, ఆర్డీవోలు, మునిసిపల్ కమి షనర్లు, జనగణన అధికారులకు అవగాహన కల్పించేందుకు గురువారం నాగర్‌కర్నూల్ కలెక్ట రేట్‌లోని ప్రధాన హాల్‌లో ఏర్పాటు చేసిన రెం డు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్, అచ్చం పేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు కలెక్ట ర్లు బి.చెన్నయ్య, దేవ సహాయంతో కలిసి కలెక్ట ర్ కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జనాభా గణన అత్యంత ప్రాధాన్యమైన ప్రభు త్వ కార్యక్రమమని ఈ ప్రక్రియలో సేకరించే సమాచారం ప్రామాణకంగా ఉండేలా అధికా రులు ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. కార్యక్రమంలో సీపీవో సుజాత, డీఈవో రమేష్‌కుమార్, ఆర్డీవోలు అర్చన, జనార్దన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.