Share News

kumaram bheem asifabad- జనాభా గణన పక్కాగా చేపట్టాలి

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:07 PM

జనాభ గణన ఫేజ్‌-2లో భాగంగా కార్యక్రమ నిర్వహణలో ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని, పక్కాగా చేపట్టాలని కలెక్టర్‌ కె. హరిత అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సీపీవో గురవయ్యలతో కలిసి సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు.

kumaram bheem asifabad- జనాభా గణన పక్కాగా చేపట్టాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కె.హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): జనాభ గణన ఫేజ్‌-2లో భాగంగా కార్యక్రమ నిర్వహణలో ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని, పక్కాగా చేపట్టాలని కలెక్టర్‌ కె. హరిత అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సీపీవో గురవయ్యలతో కలిసి సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాస్టర్‌ ట్రయినర్లు చెప్పిన ప్రతి అంశాన్ని తెలుసుకోవాలన్నారు. మొదటి విడత ఇళ్ల గణన కార్యక్రమం పగడ్భందీగా నిర్వహించామని చెప్పారు. అదే స్పూర్తితో రెండో విడతలో చేపట్టే జనగణన కార్యక్రమాన్ని సమన్వయంతో పకగడ్భందీగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో మాస్టర్‌ ట్రయినర్‌ ఊశన్న, జిల్లా యువజన క్రీడల సేవ అధికారి వెంకటేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

ప్రజలు 257వ ఇంప్లాక్ట్‌ ఇండియా ఫౌండేషన్‌ లైఫ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రాజెక్టు ద్వారా అందిస్తున్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్లి కల్టెక్టర్‌ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. సిర్పూరు కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో అక్టోబరు 16 నుంచి నవంబరు ఐదు వరకు వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ శిబిరాల ద్వారా వివిధ రకాల వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ వైద్యశిబిరంలో కంటి, చెవి, అర్థోపెడిక్‌, ప్లాస్టిక్‌ సర్జరి, శస్త్ర చికిత్సలు, దంత పరీక్షలు, క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించటం జరుగుతుందని, ఆధార్‌ కార్డుతో వైద్య శిబిరానికి హాజరైన వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

Updated Date - Oct 13 , 2026 | 11:07 PM